Begin typing your search above and press return to search.
శ్రియను మార్చను అంటున్న మొగుడు
By: Tupaki Desk | 21 March 2018 4:37 AM GMTలేదు లేదంటూనే సౌత్ బ్యూటీ శ్రియా శరణ్ పెళ్లి చేసేసుకుంది. రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చెవ్ తో పెళ్లి తతంగం ముగిసింది. ఇప్పటికే శ్రియ-ఆండ్రీల పెళ్లి ఫోటోలు అనేకం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. తను రష్యన్ అయినా సరే.. పక్కా ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్ లో పెళ్లి చేసుకున్న ఆండ్రి అందరికీ తెగ నచ్చేస్తున్నాడు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. మొత్తానికి ఒక్కటై అందరికీ కనుల పండుగ చేస్తున్నారు.
శ్రియ పెళ్లి వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. పెళ్లి తతంగం పూర్తి అయిన తర్వాత.. శ్రియను తను ఎలా చూసుకోవాలని అనుకుంటున్నాడో పెళ్లి కొడుకు చెబుతున్న వీడియో అది. హిందీలోను.. ఇంగ్లీష్ లోను తన మాటలను రాసుకుని మొబైల్ లో చూస్తూ చెప్పాడు ఆండ్రీ కొశ్చెవ్. తను శ్రియను ఏ కొంచెం కూడా మార్చాలని అనుకోవడం లేదని.. అలా అనుకుంటే అది ప్రేమ కాదని.. దాన్ని రాజీపడడం అంటారని.. అందుకే శ్రియ ఎలా ఉంటే అలా ప్రేమించడానికే తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు ఆండ్రీ. ఈ మాటలు వినగానే ఆహుతులు అందరూ చప్పట్లు కొట్టేసి కేరితంలు పెడితే.. శ్రియ మాత్రం అతడి పెదాలకు ఓ ముద్దు సుతారంగా ఇచ్చేసింది.
నువ్వు నా పిచ్చిని కూడా యాక్సెప్ట్ చేస్తావా అంటూ శ్రియ కూడా భలే అడిగేసింది. దీనికి కూడా తప్పకుండా అంగీకరిస్తా అంటూ మనస్ఫూర్తిగా ఆండ్రీ కొశ్చెవ్ ఆన్సర్ ఇచ్చాడు. మొత్తం మీద నిమిషం మాటల్లోనే తమ ఇద్దరి మధ్య ఎంతటి ప్రేమ దాగి ఉందో చూపించారు ఈ జంట.