Begin typing your search above and press return to search.
‘మంచు’ అల్లుడు.. హైదరాబాద్ సిటీకి బావ
By: Tupaki Desk | 21 Dec 2015 7:30 AM GMTమంచు లక్ష్మీ ప్రసన్న భర్త గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ. అతడి పేరు ఆండీ అన్న సంగతి కూడా జనాలకు పెద్దగా తెలియదు. మోహన్ బాబు అల్లుడిగా.. లక్ష్మీ ప్రసన్న భర్తగానే అతణ్ని గుర్తిస్తారు జనాలు. ఐతే తనకీ గుర్తింపు సంతోషాన్నే ఇస్తుందని.. తన ఓన్ ఐడెంటిటీ ఏంటన్నది తనకు మాత్రమే తెలుసని అంటున్నాడు ఆండీ. ‘‘నేను నా లాగా బతికే స్పేస్ నాకుంది. వేరే వాళ్ల కళ్లలోంచి చూస్తూ, ఎవరో అనుకున్నట్లు ‘వాళ్ల వెర్షన్ ఆఫ్ లైఫ్’ను బతకదలచుకోలేదు. అయినా మంచు వారి అల్లుడిగా నన్ను హైదరాబాద్ సిటీ అంతా.. బావగారు - బావగారు అని పిలుస్తున్నారు. అంత కంటే ఇంకేం కావాలి’’ అని చెప్పాడు ఆండీ.
తాను ఓ తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబానికి చెందిన వాడినని.. ఐతే లక్ష్మిని పెళ్లి చేసుకున్నాక తమ కుటుంబ ఆచారాలు - పద్ధతులకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా మోహన్ బాబు చూసుకున్నారని ఆండీ చెప్పాడు. ‘‘ఒకసారి మా అమ్మ చెన్నై నుంచి హైదరాబాదొస్తే.. మూడు రోజుల కోసం పాత పాత్రలన్నీ తీసేసి.. మొత్తం కొత్తవిః కొన్నారు మోహన్ బాబు. ఈ ఫ్యామిలీలోకి వచ్చాక నేనెక్కడా నా అలవాట్లు - ఆచారాల్లో రాజీ పడాల్సిన అవసరం రాలేదు’’ అని అతను చెప్పాడు.
ఇక తన మామ నటనా కౌశలం గురించి చెబుతూ.. ‘‘ఎంత పెద్ద యాక్టరైనా సరే.. ఏ పాత్ర చేస్తున్నా తన సహజమైన మ్యానరిజమ్స్ లోకి వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఏ పాత్రకు ఆ పాత్ర చేయడమన్నది చాలా కష్టం. ఉత్తమ నటుడిగా మూడు ఆస్కార్ అవార్డులు అందుకున్న హాలీవుడ్ యాక్టర్ డేనియల్ డే-లూయీస్ లో మాత్రమే అది చూశా. మళ్లీ మా మావయ్యలోనే అది గమనించా’’ అన్నాడు ఆండీ.