Begin typing your search above and press return to search.
పోలిష్ మోడల్ టాలీవుడ్ ని ఊపేస్తోంది
By: Tupaki Desk | 11 Oct 2015 5:20 AM GMTనీలి కళ్లు, ఎర్రెర్రని కురులు.. తెలతెల్లని పాలనురుగు దేహశిరులు .. ఇవన్నీ ఉంటే ఏ విదేశీ మోడల్ అనో ఠకీమని చెప్పేస్తాం. ఈ తరహా భామలు ముందుగా ముంబై పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ ఐటెమ్ నంబర్ లతో బెంబేలెత్తించి, అటుపై దక్షిణాది సినీపరిశ్రమల్లో అడుగుపెడుతున్నారు. ఇక్కడ ఐటెమ్ క్వీన్స్ గా అదరగొట్టేస్తున్నారు.
ఆ కోవలోనే గాబ్రియెలా బెర్ర్టాంటె - స్కార్లెట్ విల్సన్ - నోరా ఫతేహీ.. వంటి భామలు టాలీవుడ్ పైనా దండెత్తారు. ఈ భామల బాటలోనే మరో కొత్తభామ - నీలికళ్ల సుందరి యాంజిలా తెలుగు సినీ పరిశ్రమలో హల్‌చల్ చేస్తోంది. యాంజిలా క్రిస్లింజ్ కి హాఫ్ ఇండియన్ - హాఫ్ పోలిష్ గాళ్! జ్యోతిలక్ష్మి చిత్రంలో రాజా రాజా అంటూ హాట్ ఐటెమ్ లో బ్రహ్మీతో కలిసి స్టెప్పులు అదరగొట్టేసింది.
అమ్మ ఓ ప్రొఫెసర్. క్లినికల్ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాను. అయితే నేను చదివింది వేరు. చేస్తోంది వేరు. డెస్టినీ వేరు అని తెలుసుకుని ముంబైలో అడుగుపెట్టా. ఏడేళ్లుగా ముంబై నగరంలోనే ఉంటున్నా. అక్కడ బార్బీ లాక్ హెయిర్ ఎక్స్ టెన్షన్ పేరుతో ఓ షోరూమ్ నిర్వహిస్తున్నా. పొడవాటి శిరోజాల్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరికి కావాలన్నా మా వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ వ్యాపారాన్ని పార్టనర్స్ తో కలిసి చేస్తున్నా. దీంతోనే బాలీవుడ్ దిగ్గజాల పరిచయం ఏర్పడింది.. అంటూ చెప్పుకొచ్చింది.
అట్నుంచి ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెట్టా. పూరి ఇచ్చిన అవకాశంతో మరిన్ని ఛాన్సెస్ వెంటపడుతున్నాయి. జ్యోతిలక్ష్మికి ఆడిషన్ చేసి ఎంపిక చేసుకున్నారు. లేటెస్టుగా సైజ్ జీరో టైటిల్ ట్రాక్ లో నర్తించే ఛాన్సొచ్చింది. మరిన్ని ఛాన్సెస్ లైన్ లో ఉన్నాయి.. అంటూ చెప్పుకొచ్చింది.