Begin typing your search above and press return to search.

స్టార్ హీరో నుంచి హీరోయిన్ విడాకుల కార‌ణం

By:  Tupaki Desk   |   5 Oct 2022 7:11 AM GMT
స్టార్ హీరో నుంచి హీరోయిన్ విడాకుల కార‌ణం
X
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ.. త‌న భ‌ర్త బ్రాడ్ ఫిట్ నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనికి కార‌ణాల్ని స్వ‌యంగా వెల్ల‌డించింది. మంగళవారం నాడు త‌న భ‌ర్త‌కు వ్య‌తిరేకంగా బ్లాస్ట్ అయ్యే పత్రాలను కోర్టులో దాఖలు చేసింది.

జోలీ తన మాజీ భర్త బ్రాడ్ పిట్ తమ ఆరుగురు పిల్లలలో ఒకరిని `ఉక్కిరిబిక్కిరి చేశాడని` మరొకరిని ముఖంపై కొట్టాడని ఆరోపించింది. తన జుట్టు పట్టుకుని గోడకు ఢీకొట్టించాడని కూడా ఆమె పేర్కొంది. జోలీ సెప్టెంబర్ 2016లో జరిగిన హింసాత్మక వాగ్వివాదాన్ని స‌వివరంగా కోర్టుకు తెలిపింది. అది త‌మ‌ విడాకులకు దారితీసిందని చెప్పింది.

మాజీ భర్త బ్రాడ్ పిట్ తన పిల్లలలో ఒకరిని ఉక్కిరిబిక్కిరి చేశాడని ప్రైవేట్ జెట్ లో ఉమ్మి వేసేటప్పుడు మరొకరి ముఖం మీద చెప్పుతో కొట్టాడని ఆరోపించింది. ప్రైవేట్ జెట్‌లో 2016 లో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ వివరాలను షేర్ చేసింది.

తమ ఇద్దరి యాజమాన్యంలోని `ఫ్రెంచ్ వైనరీ ఫ్రాంఛైజీ` అమ్మకంపై వరుసగా చట్టపరమైన చర్యలు తీసుకున్న బ్రాడ్ పై ఏంజెలీనా ఎదురుదాడి చేసింది. ది న్యూ యార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఫ్రాన్స్ నుండి కాలిఫోర్నియాకు వెళ్లే విమానంలో పిట్ ప్రవర్తన తో పిల్లల ఏడుపులు త‌న‌కు బాధను కలిగించాయ‌ని...వారి వీపు మోచేతికి గాయాలవ్వ‌డానికి కార‌ణ‌మ‌య్యాడ‌ని జోలీ పేర్కొంది.

ఈ తోపులాట‌ల్లో ఒక దశలో ``అతను జోలీపై బీరు పోశాడు. అంతేకాదు... అతను పిల్లలపై బీర్ రెడ్ వైన్ పోశాడు`` అని పేర్కొంది జోలీ. మరోవైపు వెరైటీ కౌంటర్ స్యూ పత్రాలకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా షేర్ చేసింది. పిట్ జోలీని తల పట్టుకుని బాత్రూమ్ గోడపైకి నెట్టడానికి ముందు త‌న‌ భుజాలను పట్టుకుని కుదిపాడని ఆరోపించింది.

``పిల్లల్లో ఒకరు జోలీని సమర్థించ‌గా బ్రాడ్ పిట్ తన క‌న్న‌బిడ్డపైకే దూసుకెళ్లాడు. అతనిని ఆపడానికి వెనుక నుండి పట్టుకున్నాను`` అని తెలిపింది. లాస్ ఏంజెల్స్ సుప్రీం కోర్ట్ లో దాఖలు చేసిన తన కోర్టు పత్రాలలో జోలీ పరిస్థితులను బహిరంగపరచాలని ఎప్పుడూ కోరుకోలేదని తెలిపారు.

తాను అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలోనే దీనిని బ‌హిర్గ‌తం చేస్తున్నాన‌ని తెలిపింది. జోలీ- బ్రాడ్ పిట్ విడాకుల వ్య‌వ‌హారం ఏళ్ల త‌ర‌బ‌డి కోర్టుల్లో న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. కోర్టు గొడ‌వ‌ల‌తో ఆ ఇరువురి కెరీర్ కి ఇబ్బందులు త‌లెత్తాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.