Begin typing your search above and press return to search.

హాలీవుడ్ అందాల తారతో మ‌హాన‌టి లాంటి సినిమా!

By:  Tupaki Desk   |   24 Oct 2022 11:30 PM GMT
హాలీవుడ్ అందాల తారతో మ‌హాన‌టి లాంటి సినిమా!
X
హాలీవుడ్ అందాల తార ఎంజెలీనా జోలి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అందం.. అభిన‌యంతోనే హాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన బ్యూటీ. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన అంద‌మ‌ది. న‌టిగా ఎంత ఫేమ‌స్ అయిందో...వ్య‌క్తిగ‌త వ్య‌హార‌ల్లోనూ అంత‌కు మించి హాట్ టాపిక్ అవ్వ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. ఇదంతా జోలీ వ్య‌క్తిగ‌త వ్య‌హారమ‌నుకోండి.

ఇక మాన‌వ‌త్వంలో ఎంజెలీనా అంత గొప్ప మ‌న‌సు మ‌రో న‌టికి లేదేమో! అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఎందుకంటే? త‌న‌లో ఆ గొప్ప గుణం మిగ‌తా మంది నుంచి వేరు చేస్తుంది. ఇప్ప‌టికే తొమ్మిది మందిని ద‌త్త‌త తీసుకుని వాళ్ల పోష‌ణ‌...జీవితాల గురించి ఆలోచ‌న చేస్తుంది. ఆ తొమ్మిది మందికి మంచి జీవితాలిచ్చి..ఉన్నత స్థానాల్లో చూడాల‌ని ఆశ‌ప‌డుతుంది.

ఇంకా ఛారిటీల పేరుతో ఎన్నో సేవాసంస్థ‌లు నిర్వ‌హిస్తుంది. తాజాగా ఎంజెలీనా కొత్త సినిమా షూట్ కి రెడీ అవుతోంది. ప్ర‌ముఖ గాయ‌ని మ‌రియా కఖ‌ల్లాస్ బ‌యోపిక్ ని తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ద‌మ‌వుతోంది. ఈ బాధ్య‌త‌ని ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు ప‌బ్లా లారైన్ తీసుకున్నారు. ఇందులో మ‌రియా గా ఎంజెలి నా క‌నిపించ‌నుంది. మ‌రియా టైటిల్ తో చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

ఆమె వ్య‌క్తిగ‌త‌ జీవితం సాగిన తీరుతో పాటు..1970 లో చివిరి రోజుల్లో పారిస్ లో ఆమె ఎలా బ‌తింకింది అన్న‌ది హైలైట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఎంజెలినా ఆ పాత్ర గు రించి ఆస‌క్తిక‌రంగా స్పందించింది. 'మ‌రియాలాంటి గొప్ప వ్య‌క్తి జీవిత క‌థలో న‌టించ‌డ‌మంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఇప్పుడా అవ‌కాశం నాకు వ‌చ్చింది. దీన్ని బాధ్య‌త‌గా భావిస్తున్నా.

అమె జీవితంలో బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌ని ఎన్నో విష‌మ‌యాలున్నాయి. అవ‌న్నీ బ‌య‌ట‌కు తీస్తున్నాం. ప్ర‌తీ స‌న్నివేశం ఎంతో ఎమోష‌నల్ గా ఉంటుంది. అంద‌రూ చూడాల్సిన గొప్ప సినిమా ఇది అని అన్నారు.

మొత్తానికి హాలీవుడ్ లో కూడా మ‌రో 'మ‌హాన‌టి' లాంటి గొప్స సినిమాని ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంజెలీనా 'వితౌట్ బ్ల‌డ్' సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది. ద‌ర్శ‌కురాలిగా ఆమెకిది ఐద‌వ చిత్రం. అలాగే న‌టిగాను జోలీ బిజీగా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.