Begin typing your search above and press return to search.

ఆమెకి టాటూలు ఎంత ఇష్టమంటే

By:  Tupaki Desk   |   9 Feb 2016 7:30 AM GMT
ఆమెకి టాటూలు ఎంత ఇష్టమంటే
X
హాలీవుడ్ బ్యూటీ ఏంజెలీనా జోలీకీ సినిమాల కంటే పిల్లలు - ట్యాటూలు మహా ఇష్టం. ఈమెకు ముగ్గురు కన్న పిల్లలు ఉన్నా.. మరో ముగ్గురుని దత్తత తీసుకుంది. ఇక టాటూలు అంటే మహా పిచ్చి అంటారు అందరూ. అది నిజం కూడా. ఎందుకంటే.. ఇప్పటికే ఈమె శరీరంపై 9 ోట్ల పచ్చబొట్లు ఉండగా.. ఇప్పుడు మరో మూడింటిని వేయించుకుంది. ఒంటి మీద టాటూలు ఉండడం అంత పెద్ద విశేషం కాదు కానీ.. ప్రతీ పచ్చబొట్టుకూ ఓ అర్ధ, పరమార్ధం ఉండడం అసలు విశేషం.

జోలీ వీపు మధ్యలో ఉండే పీచ్ చౌలక్.. బౌద్ధ మతంలో మంచి పనులు చేసే మనస్తత్వానికి గుర్తు. వీపు కింది భాగంలో పెద్ద సైజులో బెంగాల్ టైగర్ టాటూ రూపంలో కనిపిస్తుంది. కంబోడియా పౌరసత్వం వచ్చిన ఆనందంలో దీన్ని పొడిపించుకుంది. కంబోడియాకు చెందిన మెడాక్స్ అనే పిల్లాడిని దత్తత తీసుకున్నపుడు వీపు ఎడమవైపున బౌద్ధమతానికి చెందిన ఓ మంత్రాన్ని ఖేర్మ్ లిపిలో రాయించుకుంది. ఆరుగురు పిల్లలు - భర్త బ్రాడ్ పిట్ పై ఉన్న ప్రేమకు గుర్తుగా.. వారు తన లైఫ్ ఎంట్రీ ఇచ్చిన ప్లేస్ కు సంబంధించిన అక్షాంశ, రేఖాంశాలను పచ్చ వేయించుకుంది ఏంజెలీనా జోలీ. దురదృష్టం అని భావించే 13 సంఖ్యను ఎడమ చేతి కింది భాగంలోను.. విన్ స్టన్ చర్చిల్ చారిత్రక ప్రసంగం చేసిన 1940 మే13ను రోమన్ లిపిలోను చేతిపై రాయించుకుంది.

మాజీ భర్త జానీ లీ మిల్లర్ తో పెళ్లి సందర్భంగా.. పొత్తి కడుపుపై శిలువ గుర్తు వేయించుకుంది. రైటర్ విలియమ్స్ బుక్ లోని ఓ సెంటెన్స్ ను ఎడమ చేతిపై.. మాజీ బోయ్ ఫ్రెండ్ టిమోతి హుట్టన్ తో అనుబంధానికి గుర్తుగా ఎడమ మణిక్టటుపై హెచ్ అనే లెటర్ ను పచ్చ పొడిపొంచుకుంది జోలీ. వీపు పై భాగంలో కనిపించే అక్షరాలు కంబాట్ రాక్ ఆల్బమ్ లోని నో యువర్ రైట్స్ పాటకు సంబంధించిన తొలి లైన్. వీపు పైనా, ఎడమ భుజంపైనా బౌద్ధ మత మంత్రాలు దర్శనమిస్తాయి.