Begin typing your search above and press return to search.
ట్రంప్ పై ఫైర్ అయిన హాలీవుడ్ బ్యూటీ
By: Tupaki Desk | 17 May 2016 7:06 AM GMTఅందానికే అందం అంటూ విశేషణాలు చేర్చి పొగిడేయటం హాలీవుడ్ హాట్ బ్యూటీ ఏంజెలీనా జోలి విషయంలో మామూలే. బాహ్యరూపంలోనే కాదు.. ఆమె మనసు కూడా ఎంతో అందమైనదిగా చెబుతుంటారు. మన దగ్గర మాదిరి ఏదైనా వివాదాస్పద అంశం మీద స్పందించే విషయంలోనూ.. పెద్ద పెద్ద రాజకీయ అంశాల గురించి తమ అభిప్రాయాల్నినిక్కచ్చిగా వెల్లడించటంలో సెలబ్రిటీలు స్పందించేందుకు అట్టే ఇష్టపడరు. అలాంటిది ఏంజెలీనా మాత్రం అందుకు భిన్నంగా తన మనసులోని అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా తేల్చి చెప్పేశారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న డోనాల్డ్ ట్రంప్ మీద ఆమె తాజాగా ఫైర్ అయ్యారు.
ముస్లింల వ్యతిరేకంగా ట్రంప్ ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై పలువురు అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడా జాబితాలో ఏంజెలీనా జోలీ కూడా చేరిపోయారు. బీబీసీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యల మీద తన అభ్యంతరాల్ని వ్యక్తం చేయటమే కాదు.. ఆ మాటల్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. ట్రంప్ నుంచి ఈ తరహా కఠినమైన మాటల్ని వినాల్సి రావటం చాలా కష్టంగా ఉందని పేర్కొంది.
ముస్లింల మీద ట్రంప్ చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రస్తావించే క్రమంలో ఆమె అమెరికా ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఎంతోమంది ప్రజలు మతాలకు అతీతంగా బతికేందుకు అమెరికాకు వస్తుంటారని.. అలాంటిది ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత పదవి కోసం పోటీ చేస్తున్న వ్యక్తి నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటం ఏమిటని ఆమె ప్రశ్నించటంతో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై మరోసారి ఘాటైన చర్చకు తావిచ్చిందని చెప్పాలి. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఒక నేత మీద విమర్శలు చేయటానికి.. ఆయన వాదనల్ని తప్పని తేల్చి చెప్పటానికి ఏ మాత్రం దడవని ఏంజెలీనాను చూస్తే.. ఆమె మరింత అందంగా కనిపించటం ఖాయం. ధైర్యం అందాన్ని రెట్టింపు చేయటం మామూలేగా.