Begin typing your search above and press return to search.

ఐఫోన్లో ఫోటోలే విడాకులకు కారణం

By:  Tupaki Desk   |   30 Sep 2016 5:30 PM GMT
ఐఫోన్లో ఫోటోలే విడాకులకు కారణం
X
హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నలుగురు పిల్లలను దత్తత తీసుకోవడం నుండి అసలు బ్రాడ్ పిట్ తో రొమాన్స్ వరకు అన్నింటిలోనూ ఆమె టాప్. ఈ సెక్సీ లేడీ క్యాన్సర్ ప్రివెన్షన్ సర్జరీ చేయించుకుని.. తన వక్షోజాలను తీసివేయించుకుని.. ప్రపంచం అంతటికీ ఒక ఇనిస్పిరేషన్ గా నిలిచింది కూడా. అయితే ఇవన్నీ ఒకెత్తు.. తాజాగా ఆమె తన పిల్లలను బ్రాడ్ పిట్ సరిగ్గా చూసుకోవట్లేదంటూ కోర్టులో డైవర్స్ పిటీషన్ దాఖలు చేయడం మరో ఎత్తు.

అస్సలు ఎవ్వరూ ఊహించలేదు బ్రాంజెలినా జంట విడాకులు తీసుకుంటారంటే. కాకపోతే జోలీ దాఖలు చేసిన పిటీషన్ పై స్పందించిన బ్రాడ్.. అసలు జోలీ ఇలా చేస్తుందని ఊహించలేదని చెప్పాడు. తీరా ఆరా తీస్తే.. ఈ అమ్మడు భర్తకు విడాకులు ఇవ్వడానికి వేరే కారణాలు ఉన్నాయట. నిజానికి 12 ఏళ్ళ నుండి కలసి ఉంటున్న జోలీ అండ్ పిట్.. ఈ మధ్యన బాగా గొడవలు పడుతున్నారట. దానికి కారణం.. పిట్ కాస్త ఇతర స్ర్తీలతో సాన్నిహిత్యంగా మెలగడమే. ఫ్లయిట్ ఎక్కితే ఎయిర్ హోస్టెస్ లతో రొమాన్సులు.. అలాగే ఇతర హీరోయిన్లతో పార్టీల్లో కలసి ఫోజులు ఇవ్వడాలు.. హగ్గులూ కిస్సులూ.. పైగా అవన్నీ తన ఐఫోన్ లో పెట్టుకోవడం ఇంకా పెద్ద గొడవ అయ్యిందట.

మొత్తానికి ఐఫోన్లో ఫోటోలు సేవ్ చేసుకోవడం అనేదే ఈ డైవర్సుకు ప్రధాన కారణం అని అర్దమవుతోంది. అయితే ఇవన్నీ బ్రాడ్ పిట్ పబ్లిక్ గా ఒప్పుకోవట్లేదులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/