Begin typing your search above and press return to search.

18 నిమిషాలు తేనెటీగ‌ల్ని ముఖంపై క‌ప్పుకుంది!

By:  Tupaki Desk   |   24 May 2021 4:30 AM GMT
18 నిమిషాలు తేనెటీగ‌ల్ని ముఖంపై క‌ప్పుకుంది!
X
రొటీన్ గా ఉంటే హాలీవుడ్ స్టార్ అయినా లోక‌ల్ స్టార్ అయినా ప‌ట్టించుకోరు. ఏదైనా సంథింగ్ ఉంటేనే ఎవ‌రైనా ప‌ట్టించుకునేది. అందుకేనేమో.. ఇదిగో ఇలా వ‌ర‌ల్డ్ ని షేక్ చేసే ఫోటోషూట్ తో దుమ్ము రేపింది ఏంజెలినా జోలీ. ఓవైపు వ్య‌క్తిగ‌త జీవితంలో ర‌క‌ర‌కాల వివాదాల‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న జోలీ మ‌రోవైపు ఫ్యాష‌న్ ప్ర‌పంచ‌పు పోక‌డ‌ల్ని మాత్రం అస్స‌లు విడిచిపెట్ట‌డం లేదు.

ఏంజెలినా ఏకంగా ఫోటో షూట్ కోసం దాదాపు 18 నిమిషాలు తేనెటీగలతో కప్పబడి ఉంది అంటే ఆ గ‌ట్ ఫీలింగ్ ని క‌మిట్ మెంట్ ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఫోటోషూట్ వెన‌క ప్ర‌త్యేక‌మైన కాజ్ ఉంది. తేనెటీగ సంరక్షణపై అవగాహన పెంచడానికి హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కు పోజులిచ్చింది. ఫోటోషూట్ కోసం ఏంజెలీనా జోలీ వందలాది తేనెటీగల‌తో త‌న ముఖాన్ని శ‌రీరాన్ని క‌ప్పబ‌డి ఉండ‌డం స‌ర్ ప్రైజ్ విష‌యం.

ఏంజెలీనా.. గాబ్రియేలా హర్స్ట్ దుస్తులను ధరించారు. పెద్ద సంఖ్యలో తేనెటీగలు ఆమె ఛాతీ .. భుజాల చుట్టూ క‌వ‌ర్ చేసి క‌నిపిస్తున్నాయి. కొన్ని ఆమె ముఖం మీద కూడా ఉన్నాయి. మహమ్మారిలో భద్రతా సమస్యల వల్ల తేనెటీగలు కారణంగా ఫోటోషూట్ ఎంత క్లిష్టంగా ఉందో ఫోటోగ్రాఫర్ డాన్ వింటర్స్ వెల్ల‌డించారు. జోలీ మినహా సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణాత్మక సూట్‌లో ఉండాల్సి వచ్చింది. తేనెటీగలు ప్రశాంతంగా ఉండటానికి ప‌రిస‌రాలు నిశ్శబ్దంగా చాలా చీకటిగా ఉండాలి.

నేను తేనెటీగలు గుంపుగా ఉండాల్సిన‌ చోట ఆమె శరీరంలోని వివిధ‌ ప్రదేశాలలో ఫేరోమోన్ ను ప్రయోగించాను. తేనెటీగలు ఫెరోమోన్ వైపు ఆకర్షితులవుతాయి. అయితే ఇది సమూహంగా ఉండకూడదని ప్రోత్సహిస్తుంది. మేము ఆమె నడుము ముందు విశ్రాంతి తీసుకున్న బోర్డు మీద పెద్ద సంఖ్యలో తేనెటీగలను కూడా ఉంచాము.

ది గ్రేట్ ఫ్యాష‌నిస్టా ఏంజెలినా జోలీ 18 నిమిషాలు ఎటూ క‌ద‌ల‌కుండా తేనెటీగలతో కప్పబడి ఉన్నారు. తేనెటీగల చుట్టూ ఉండటం ఎల్లప్పుడూ నన్ను విస్మయానికి గురిచేసే అనుభవం. ఈ షూట్ హాజరైన వారందరికీ విస్మయం కలిగించే సంఘటన అని నేను భావిస్తున్నాను. ప్రపంచ బీ డే కోసం ఇది మా కానుక‌. ఫోటోగ్రఫీ చరిత్రలో ఇది త‌ల‌మానిక‌మైన‌ది.. అని అన్నారు.