Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ ప్రేమ వ్యవహారం మరింత స్పష్టత

By:  Tupaki Desk   |   30 Sep 2021 12:30 AM GMT
స్టార్‌ హీరోయిన్‌ ప్రేమ వ్యవహారం మరింత స్పష్టత
X
హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హీరోయిన్‌ ఏంజెలీనా జోలీ ప్రేమ వ్యవహారం గురించి గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 45 ఏళ్లు దాటిన ఏంజెలీనా జోలీ భర్త బ్రాడ్ పిట్‌ తో 2019 లో విడి పోయింది. ఆ తర్వాత కొన్నాళ్లు సింగిల్ గానే ఉన్న ఈమె ఈమద్య కాలంలో కెనడాకు చెందిన సింగర్ ది వీకెండ్ అబెల్ టెస్ఫాయె తో డేటింగ్‌ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి బయట రెండు మూడు సార్లు కనిపించారు. అయితే వీరిద్దరు కూడా ఇప్పటి వరకు తమ వ్యవహారంను బాహాటంగా ప్రకటించలేదు. తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌ లో రెండు గంటల పాటు సమయం గడిపారు. ఆ తర్వాత బయటకు వెళ్లి పోయారు. ఆసమయంలో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు.

విడాకులు తీసుకున్న ఏంజెలినా జోలీ కొత్త ప్రేమ కథ దీంతో కన్ఫర్మ్‌ అయినట్లే అంటే అంతర్జాతీయ మీడియా కథనాలు రాయడం మొదలు పెట్టింది. వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నారనే పుకార్లు కూడా కొందరు బలంగా పుట్టిస్తున్నారు. ఏంజెలినా జోలీకి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారి బాధ్యత ఈమె చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ రిలేషన్‌ షిప్ ను ఆమె కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి స్టార్‌ హీరోయిన్‌ ప్రేమ వ్యవహారం మీడియాలో హాట్‌ టాపిక్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న ఏంజెలినా జోలీ కొత్త రిలేషన్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకోవడం కనిపిస్తుంది.

2014 లో హాలీవుడ్ హీరో బ్రాడ్‌ పిట్ ను వివాహం చేసుకుంది. ఇద్దరు ఐదేళ్ల కాపురం చేశారు. ఈ జంట విడిపోయే సమయంకు ఆరుగురు సంతానం ఉన్నారు. ఆరుగురిలో ముగ్గురు వీరికి జన్మించిన పిల్లలు కాగా ముగ్గురు మాత్రం దత్తత తీసుకున్న పిల్లలు. గత కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న ఏంజెలినా జోలీ మళ్లీ ప్రేమ విషయంలో మీడియా లో రావడం చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంలో ఆమె సాధ్యం అయినంత త్వరగా స్పందించి మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానాలు చెప్పాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా వీరి ఫొటోలను షేర్‌ చేస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించుకుంటున్నారు. మరి ఏంజెలినా జోలీ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.