Begin typing your search above and press return to search.
ఏంజెలీనా అలాంటివి తిన్నదంటే మీరు నమ్మరు
By: Tupaki Desk | 22 Feb 2017 1:30 PM GMTఅందం అంటే ఏంజెలీనా జోలిదే. ఆమె బ్యూటీకి పిధా అయ్యే వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. అంతేనా.. అంతటి బ్యూటీలోని మంచి మనసుకు లోకమంతా ఇప్పటికే పలుమార్లు పిధా అయ్యింది. వివిధ దేశాల అనాధల్ని దత్తత తీసుకొని సొంత పిల్లల కంటే మిన్నగా చూసుకోవటమే కాదు.. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ముందుండే ఆమెను అందరూ అభిమానించే వారే.
వ్యక్తిగతంగా చూస్తే.. భర్త బ్రాడ్ పిట్ తో విడాకులు తీసుకునేందుకు సిద్దమైన ఆమె.. వృత్తి పరంగా ‘ఫస్ట్ దే కిల్ మై పాధర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె కంబోడియాకు వెళ్లారు. ఇక్కడ.. ఆమె తిన్న ఫుడ్ గురించి తెలిస్తే.. ఉలిక్కిపడాల్సిందే. కలలో కూడా ఊహించని విధంగా ఏంజెలీనా.. నల్లులు.. కీచురాళ్లు.. సాలీళ్లు.. తేళ్లు వంటి కీటకాల్ని వండుకొని తిన్న వైనాన్ని బీబీసీ తన ఇంటర్వ్యూలో ప్రపంచానికి చూపించేసింది.
ఏంజెలీనా ఏంటి? ఇలాంటివి కూడా తింటుందా? అని ఆశ్చర్యపోతున్న వారే కాదు.. వామ్మో అంటూ వికారంగా ముఖం పెట్టేవారెందరో. ఇదిలా ఉంటే.. తాను తిన్న ఆహారం గురించి ఏంజెలీనా వివరణ ఇస్తూ.. కంబోడియా ప్రజలు ఇలాంటి ఫుడ్ తింటారని చెప్పుకొచ్చారు. అన్నట్లు ఏంజెలీనా పిల్లల్లో పెద్దోడు కంబోడియా దేశానికి చెందిన కుర్రాడే. కొడుక్కి నచ్చిన ఫుడ్ ను తల్లి తినటం తప్పు అవుతుందా? ఈ యాంగిల్ లో చూసినప్పుడు ఏంజెలీనా తింటున్న ఫుడ్ గురించి మీకెలా అనిపించింది?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/