Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ అంత పెద్ద చైన్ స్మోకరా!

By:  Tupaki Desk   |   27 Nov 2016 3:52 AM GMT
ఆ హీరోయిన్ అంత పెద్ద చైన్ స్మోకరా!
X
బ్రాడ్ పిట్.. ఏంజెలీనా జోలీలు.. విడిపోతున్న విషయం పాత సంగతే. ఇంకా అఫీషియల్ గా డైవోర్స్ అందుకోలేదు కానీ..ఇప్పటికే వీరిద్దరూ ఎవరికి వారే హడ్సన్ నదీ తీరే అయిపోయారు. ఈ విడాకులకు ఇప్పటికే చాలా కారణాలు వినిపిస్తున్నా.. బ్రాడ్ ఇప్పటికే మరో స్టార్ హీరోయిన్ తో కొత్త సావాసాలు మొదలుపెట్టేశాడనే టాక్ కూడా ఉంది.

మరోవైపు ఏంజెలీనా జోలీ మాత్రం.. తెగ తాగేస్తోందట. తాగేస్తోందంటే ఆల్కహాల్ కాదు.. హెల్త్ పరంగా అంతకంటే ఎక్కువ చేటు చేసే సిగరెట్లు. మామూలుగానే ఈ బ్యూటీ స్మోకర్. మగ పొగరాయుళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ఉఫ్ ఉఫ్ మని ఊదేస్తుంది. ఇప్పుడు బ్రేకప్ గొడవ తర్వాత చైన్ స్మోకర్ గా మారిపోయిందట. ఇప్పటికే ఏంజెలీనాకు పలు ఆరోగ్య సమస్యలున్నాయి. వీటిలో బోన్స్ కి.. స్కిన్ కి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి.

చైన్ స్మోకింగ్ కారణంగా.. ఏంజెలీనా జోలీ హెల్త్ విపరీతంగా ఎఫెక్ట్ అవుతోందని సన్నిహితులు అంటున్నారు. కనీసం క్యాన్సర్ సంబంధిత పరీక్షలు కూడా చేయించుకోకుండా.. విపరీతంగా సిగరెట్స్ ను ఊదేస్తుండడం.. సన్నిహితులను అభిమానులను తెగ కలవరపెట్టేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/