Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ : రంగా.. పూజా..రాధ.. గిరీల క‌థ‌

By:  Tupaki Desk   |   9 Jan 2023 6:26 AM GMT
టీజ‌ర్ టాక్ : రంగా.. పూజా..రాధ.. గిరీల క‌థ‌
X
కోవిడ్ త‌రువాత ఓటీటీ కంటెంట్ కు ఫుల్ డిమాండ్ పెరిగిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా సామాన్యుల‌కు టికెట్ రేట్లు భారంగా మార‌డంతో థియేట‌ర్ల కంటే ఓటీటీలే ముద్దు అంటూ స‌గ‌టు ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు జై కొట్టేస్తున్నారు. దీంతో య‌చాలా వ‌ర‌కు ఆర్టిస్ట్ లు ఖాలీ వుండ‌టం లేదు.

బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. చివ‌రికి యంగ్ డైరెక్ట‌ర్స్ కూడా ఆర్టిస్ట్ లుగా మారి కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ వెబ్ సిరీస్ లు చేస్తున్నారంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో మారిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' మూవీతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించడాన్ని మించి న‌టుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సిరీస్ లు చేస్తున్నాడు.

త‌న‌తో పాటు మ‌డోన్నా సెబాస్టియ‌న్ , త‌రుణ్ భాస్క‌ర్‌, బిందు మాధ‌వి, సుహాస్‌, ర‌వీంద్ర విజ‌య్‌, ఫ‌ని ఆచార్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ వెబ్ డ్రామా 'యాంగ‌ర్ టేల్స్‌'. ప్ర‌భాల తిల‌క్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా, శ్రీ‌ధ‌ర్ రెడ్డి, నటుడు సుహాస్ నిర్మించారు.

షోమ‌వారం 'యాంగ‌ర్ టేల్స్‌' టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కానుంది. రంగా.. పూజా..రాధ.. గిరీల నేప‌థ్యంలో సాగే ఓ వింతైన క‌థ‌గా ఈ సిరీస్ ని ద‌ర్శ‌కుడు ప్ర‌భాల తిల‌క్ రూపొందించారు. ఇందులో యువ ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా ప్ర‌ధాన పాత్ర‌లో రంగా గా న‌టించాడు. మోడ్ర‌న్ యువ‌తి పూజాగా మ‌డోన్నా సెబాస్టియ‌న్ క‌నిపించ‌గా గృహిని రాధ‌గా బిందు మాధ‌వి న‌టించింది.

గిరి పాత్ర‌లో ర‌వీంద్ర విజ‌య్ న‌టించాడు. ఈ నాలుగు పాత్ర‌ల మ‌ధ్య వున్న అనుబంధం ఏంటీ? ఈ పాత్ర‌ల‌కు త‌రుణ్ భాస్క‌ర్‌, ఫ‌ణి ఆచార్య‌, సుహాస్ పాత్ర‌ల‌కున్న సంబంధం ఏంటీ అన్న‌ది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. కొత్త త‌ర‌హా క‌థ‌తో రూపొందిన ఈ సిరీస్ త్వ‌ర‌లో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన డేట్ ని మేక‌ర్స్ ప్ర‌క‌టించే అవ‌కాశం వుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.