Begin typing your search above and press return to search.
అందాల రాక్షసి నెటిజన్ కి గట్టి కౌంటరిచ్చింది
By: Tupaki Desk | 1 Feb 2022 11:00 PM ISTఓ అంశం విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించాలన్నా సెలబ్రిటీలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏమంటే ఎవరికి కోపం వస్తుందా? అని భయం భయంగానే స్పందిస్తున్నారు. చేసే ట్వీట్ లో తప్పదొర్లితే నెటిజన్ లు అడ్డంగా బుక్ చేస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా స్పందించడానికి స్టార్స్ ఆలోచిస్తున్నారు. ఇదిలా వుంటే అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ కి భారీ క్లాస్ ఇచ్చేసింది.
ఒక విధంగా చెప్పాలంటే గట్టి కౌంటర్ ఇచ్చేసింది. మతమార్పిడికి బలవంతం చేశారంటూ లావణ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయం ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మంది లావణ్య పేరుకు బదులు హీరోయిన్ లావణ్య త్రిపాఠి అనే హ్యాష్ ట్యాగ్ ని వాడుతున్నారు. దీంతో ఓ నెటిజన్ సదరు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
`లావణ్య త్రిపాఠి అనే హ్యాష్ ట్యాగ్ వాడకండి. లావణ్య తమిళనాడుకు చెందిన ఓ సాధారణ దళిత యువతి. అయితే లావణ్య త్రిపాఠి ఓ చవకబారు నటి. ధర్మం కోసం జీవితాన్నే త్యాగం చేసిన లావణ్యను హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పోల్చకండి` అని దురుసుగా స్పందించాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై లావణ్య త్రిపాఠి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
`నీలాంటి వాళ్లు అమ్మాయిల గురించి చీప్ గా మాట్లాడతారని, కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం వెంటనే ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారని, ముందు ప్రతి ఒక్కరినీ గౌనవించడం నేర్చుకో ` అని ఇది చాలా బాధకరమైన సంఘటన అని, సమాజంలోని వాస్తవ పరిస్థితి ఇదే` అంటూ ఫైరయింది. లావణ్య త్రిపాఠి పోస్ట్ చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.