Begin typing your search above and press return to search.
ఒంటరి దీవుల విహారంలో రైజింగ్ బ్యూటీ
By: Tupaki Desk | 27 Jun 2023 11:00 AM GMTఅనిఖా సురేంద్రన్ .. 19 ఏళ్ల అందాల యువనాయిక. కథానాయికగా ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. సంగీతం సినిమాలు టెలివిజన్ షోలతో ఈ భామ పాపులర్. అనిఖా నటించిన డజను పైగా సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. బుట్టా బొమ్మ - ఓ మై డార్లింగ్ (మొదటి మలయాళ చిత్రం ) చిత్రాలతో నటిగా తన ఉనికిని చాటుకుంది. అలాగే ఉన్ని ముకుందన్ 'మలికప్పురం' అద్భుతమైన విజయం సాధించింది.
అనిఖా నటించిన చిత్రాల్లో ఓ మై డార్లింగ్ చాలా ప్రత్యేకమైనది. ఈ చిత్రంలో Gen-Z అమ్మాయిగా డ్రామా లేదా K-పాప్ అంటే పడి చచ్చే యువతిగా నటించింది. కాలేజీ స్టూడెంట్ గా ఒక సాధారణ యుక్తవయస్కురాలుగా బబ్లీ పాత్రల్లో నటించి మెప్పించింది.
అనిఖా సురేంద్రన్ అల్లరి అమ్మాయిగా చివరికి మద్యం సేవించే యువతిగాను నేటితరానికి ప్రతిబింబంగా నటించి యువత హృదయాలు దోచింది. అనిఖా ప్రస్తుతం సౌత్ లో కెరీర్ పరంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే ఇతర నాయికల్లానే సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ ని సంపాదిస్తోంది.
తాజాగా ఒంటరి దీవుల విహారం నుంచి కొన్ని ఫోటోలు వీడియోలను అనిఖా షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. నేటితరంలో చురుకైన యువతిగా యూత్ హృదయాలను హత్తుకున్న ఈ బ్యూటీకి కథానాయికగా పెద్ద రేంజ్ కెరీర్ ఉందనడంలో సందేహం లేదు.
అనిఖా కెరీర్ మ్యాటర్ కి వస్తే మాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం కింగ్ ఆఫ్ కోథాలో నటిస్తోంది. ఇందులో దుల్కార్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. PT సర్... వసువిన్ గర్బినిగల్ అనే రెండు తమిళ చిత్రాల్లోను అనిఖా నటిస్తోంది.