Begin typing your search above and press return to search.

ఆమె న‌డుముపై చెయ్యేసాడు.. ఇదేం పాడు ప‌ని హీరోగారు?

By:  Tupaki Desk   |   2 July 2023 3:00 PM GMT
ఆమె న‌డుముపై చెయ్యేసాడు.. ఇదేం పాడు ప‌ని హీరోగారు?
X
ఆ సీనియ‌ర్ హీరో ఎంతో స్వేచ్ఛ‌గా యువ‌నాయిక న‌డుముపై చెయ్యేసాడు. ఊహించ‌ని విధంగా అత‌డు ఆ న‌డుమును అదిమి పెడుతున్న‌ట్టు ఆ వీడియోలో క‌నిపించింది. ఇంకేం ఉంది... ఏంటి సార్ ఈ నిర్వాకం? అంటూ ఆ ఈవెంట్లో సంఘ‌ట‌న‌ను అదే ప‌నిగా ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌నులు. ఏమిటో స్టార్ హీరో చేసిన ఈ పాడు ప‌ని? అంటూ చాలా మంది వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు హిందీ మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యువ‌హీరోయిన్ న‌డుముపై పెళ్ల‌యిన న‌టుడు ఇలా చెయ్యి వేయ‌డం స‌రైన‌దేనా? అంటూ ఆయ‌న కుమార్తెను కూడా ప్ర‌శ్నించారు నెటిజ‌నం.

ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో స‌ద‌రు స్టార్ హీరో ఎవ‌రు? ఆ యువ‌ హీరోయిన్ ఎవ‌రు? అంటే.. స్టార్ హీరో అనీల్ క‌పూర్ కాగా యువ‌నాయిక శోభిత ధూళిపాల‌. సీనియ‌ర్ న‌టుడు అనిల్ కపూర్ అందాల‌ శోభితా ధూళిపాళ స‌న్న‌జాజి న‌డుముపై సుతారంగా చెయ్యేశాడు. అంతేకాదు ఆ స‌మ‌యంలో మీడియా ముందే అత‌డి వింత‌యిన‌ ఎక్స్ ప్రెష‌న్ ర‌క‌ర‌కాల సందేహాల‌కు తావిచ్చింది.

చక్కటి వైన్ లాగా వృద్ధాప్యంలో ఉన్న క‌పూర్ జీ ఏమిటా పాడు ప‌నులు? అంటూ కొంద‌రు నిల‌దీసారు. ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ యువహీరోలకు సవాల్ విసిరేందుకు అనీల్ క‌పూర్ ఎలాంటి అవ‌కాశాన్ని వదిలిపెట్టడం లేదు. తాజా వెబ్ సిరీస్ `ది నైట్ మేనేజర్ 2` భారీ విజయం తర్వాత ప్ర‌చార‌కార్య‌క్ర‌మంలో ఇలా ప్ర‌వ‌ర్తించారు క‌పూర్ జీ. ఆదిత్య రాయ్ కపూర్ - శోభితా ధూళిపాల స‌హా అనీల్ క‌పూర్ నైట్ మేనేజ‌ర్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. అయితే ప్రమోషన్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ వీడియో నెటిజ‌నుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీనియ‌ర్ హీరో ట‌చ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అలా కెమెరా కోసం పోజులిచ్చేటప్పుడు శోభిత నడుమును సీనియ‌ర్ న‌టుడు గట్టిగా పట్టుకోవడంపై విమ‌ర్శ‌లు చెల‌రేగాయి.

ఒక నెటిజ‌న్ ఈ వీడియోపై స్పందిస్తూ-``నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను.. కానీ ఆ పెద్దాయ‌న ఏదో చేస్తున్నాడు.. గగుర్పాటుగా ఉంది.. చుట్టూ ఎక్కువమంది లేరు.. శోభిత చాలా అసౌకర్యంగా ఉంది`` అని వ్యాఖ్యానించాడు. ``అతను వివాహం చేసుకున్నాడు.. ఆమె(శోభిత‌) కంటే పెద్ద‌వారైన‌ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చాలా సిగ్గుచేటు. సోనమ్ ఇతరులను విమ‌ర్శించే ముందు మీ తండ్రిని తనిఖీ చేయండి`` అంటూ మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. ``కుమార్తె ఉన్న‌ సీనియ‌ర్ న‌టి దృఢమైన స్త్రీవాద చిత్రాల్లో న‌టిస్తారు. మీ తండ్రిని తిరస్కరించండి.. అతను యువ‌కుడిలా ప్ర‌వ‌ర్తించ‌డం బాధాకరం`` అని వేరొక‌రు వ్యాఖ్యానించారు.