Begin typing your search above and press return to search.
ఇక్కడ డాడ్ ఆన్ డ్యూటీ
By: Tupaki Desk | 30 Sep 2017 4:50 AM GMTకూతురు ఏ స్థాయికి ఎదిగినా కన్నతండ్రి ఓ కంట కనిపెట్టి కాచుకుంటూనే ఉంటాడు. ఈ విషయంలో సినిమా స్టార్లేం అతీతులు కాదంటున్నాడు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్. సోనమ్ కపూర్ లాస్ట్ ఫిలిం నీర్జా ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత ఆమె బోలెడు అవార్డులు అందుకుంది. రీసెంట్ గా ఓ అవార్డు వోగ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకుంది. ఈ ఈవెంట్ కు సోనమ్ వెంట ఆమె తండ్రి అనిల్ కపూర్ కూడా వెళ్లాడు. ఆ టైంలో సోనమ్ తన ఫోనులో ఏదో చూసుకుంటూ ఉండగా.. ఆమె ఏం చూస్తోందా అని ఒకింత ఆరాగా అనిల్ ఆమె ఫోన్ వంకే చూస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు.
ఈ ఫొటోను ఓ ఫిలిం మ్యాగజైన్ ‘అందరు నాన్నలు అంతే’ అనే టైటిల్ తో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి అనిల్ కపూర్ ‘ఈ మాట నిజం. మాకో క్లబ్ ఉంది. వాటికి వార్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తుంటాం’’ అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చి డాడ్ ఆన్ డ్యూటీ అనే హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేశాడు. దీంతోపాటు ఇదే ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ‘‘అతి జాగ్రత్తపరుడైన నాన్న కెమెరాకు దొరికిపోయాడు. తేలుకుట్టిన దొంగలా ఉంది నా పరిస్థితి. జనాలను చంపేది గన్నులు కాదు. అందమైన కూతుళ్లున్న తండ్రులు’’ అంటూ వెరైటీ కామెంట్ కూడా పెట్టాడు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నవాళ్లు తమ కొడుకులను హీరోలుగా చేయాలని చూస్తారు తప్ప కూతుళ్లు సినిమాల్లో నటిస్తామంటే పెద్దగా ఇష్టపడరు. దాంతో చాలామంది తెర వెనుకనే ఉండిపోతారు. అయితే ఈ ట్రెండ్ ఈ మధ్య మారుతోంది. ఈ విషయంలో బాలీవుడ్ బాగా ముందుంది. ఒకప్పటి హీరోల కూతుళ్లు చాలామంది స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్నారు. బాలీవుడ్ లో సోనమ్ కపూరే కాకుండా శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి - శక్తి కపూర్ తన శ్రద్ధ కపూర్ - డైరెక్టర్ మహేష్ భట్ డాటర్ ఆలియా భట్ హీరోయిన్లుగా మంచి సక్సెస్ లే సాధించారు.