Begin typing your search above and press return to search.

అబ్బాయి లవ్‌ కు బాబాయి ఫుల్‌ సపోర్ట్‌

By:  Tupaki Desk   |   5 Dec 2018 4:16 PM GMT
అబ్బాయి లవ్‌ కు బాబాయి ఫుల్‌ సపోర్ట్‌
X
బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌, సీనియర్‌ హీరోయిన్‌ మలైక అరోరాలు ప్రేమలో ఉన్నట్లుగా గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. తాజాగా తమ ఎఫైర్‌ పై మెల్ల మెల్లగా వారే క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. కలిసి బయట తిరగడంతో పాటు, ఇద్దరు జాయింట్‌ గా ఒక ప్లాట్‌ ను కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది విడాకులు తీసుకున్న మలైకా అరోరా అతి త్వరలోనే అర్జున్‌ తో మరో పెళ్లికి రెడీ అయిపోతోంది.

మలైకా అరోరాతో అర్జున్‌ కపూర్‌ పెళ్లికి కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతుందా లేదంటే, సింపుల్‌ గా స్నేహితుల మద్య జరుగుతుందా అంటూ కూడా బాలీవుడ్‌ లో చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో అర్జున్‌ కపూర్‌ బాబాయి అనీల్‌ కపూర్‌ స్పందించాడు. అర్జున్‌ కపూర్‌ ప్రేమ వివాహంను కుటుంబ సభ్యులందరం సమర్థిస్తామన్నాడు. తమ కుటుంబంలోని వ్యక్తి అభిప్రాయాలను అందరం గౌరవించుకుంటామని అనీల్‌ కపూర్‌ అన్నాడు.

ఇంకా అనీల్‌ కపూర్‌ మాట్లాడుతూ జాన్వీ కపూర్‌, ఇషాన్‌ లు ఇంకా మంచి సినిమాలు చేయాలన్నాడు. రణ్‌ బీర్‌ కపూర్‌ మరియు ఆలియా భట్‌ లు కూడా ప్రేమలో ఉన్నారని అనీల్‌ కపూర్‌ అన్నాడు. వారిద్దరు ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నారు. వారిద్దరి వివాహం కూడా త్వరలోనే జరుగుతుందనే అభిప్రాయంను అనీల్‌ కపూర్‌ వ్యక్తం చేశారు.