Begin typing your search above and press return to search.
చిత్రపురి కొత్త అధ్యక్షుడి ముందు పెను సవాళ్లు
By: Tupaki Desk | 12 Dec 2020 8:43 AM GMTడిసెంబర్ 10న ఉత్కంఠభరితంగా చిత్రపురి హిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో నాలుగు ప్యానెళ్ల మధ్య పోటీలో వినోద్ బాల ప్యానెల్ గెలుపొందగా.. అనీల్ కుమార్ ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
పదకొండు మంది సభ్యులున్న వినోద్ బాలా ప్యానెల్ నుండి పది మంది చక్కని మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. 2020 -2025 సీజన్ కి అధ్యక్షుడిగా అనీల్ కుమార్ వల్లభనేని.. వైస్ ప్రెసిడెంట్ గా వి. ప్రవీణ్ కుమార్ యాదవ్.. కార్యదర్శిగా కాదంబరి కిరణ్ .. కోశాధికారిగా అనుముల మహానందరెడ్డి ఎంపికయ్యారు.
ఎలక్షన్ లో గెలిచిన కొత్త అధ్యక్షుడు కొత్త కమిటీ ముందు బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం ఆలస్యమైందన్న ఆరోపణలు ఉన్నాయి. చిత్రపురిపై ఈ ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు మిన్నంటాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమిని పేదలైన సినీకార్మికులకు ఇచ్చేందుకు ఇంతకుముందు అంగీకరించింది. ప్రభుత్వ సాయం అడిగి ఇప్పటికే ఇండ్లు లేని పేద సినీకార్మికులకు ఇండ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఇక చిత్రపురి కాలనీలో మంచి నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాల్సి ఉంటుంది. చిత్రపురి కాలనీ విద్యార్థులకు కార్పొరెట్ విద్యను తక్కువ ఖర్చులో అందించే వెసులుబాటును కల్పించాలన్న డిమాండ్ ని పరిశీరిలించి పష్కరించాల్సి ఉంది.