Begin typing your search above and press return to search.

నాకున్న భయం అదొక్కటే: అనిల్ రావిపూడి

By:  Tupaki Desk   |   20 May 2022 2:53 AM GMT
నాకున్న భయం అదొక్కటే: అనిల్ రావిపూడి
X
వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమాను రూపొందించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. వెంకీ సరసన తమన్నా.. వరుణ్ జోడీగా మెహ్రీన్ అలరించిన ఈ సినిమాలో, మరో ముఖ్యమైన పాత్రలో సోనాల్ చౌహాన్ కనువిందు చేయనుంది. ఇక ఈ సినిమాకి పూజ హెగ్డే ఐటమ్ హైలైట్ గా నిలవనుంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో వెంకీ.. వరుణ్.. అనిల్ పాల్గొన్నారు. ముందుగా వెంకటేశ్ మాట్లాడుతూ.. 'ఎఫ్ 2' సినిమాలో తమని పట్టించుకోవడం లేదంటూ భార్యలు .. భర్తలను టార్చర్ చేయడం ఉంటుంది. 'ఎఫ్ 3' విషయానికి వస్తే డబ్బు చుట్టూ ఈ కథ నడుస్తుంది.

కేవలం వినోదమే కాకుండా అందులో ఒక సందేశం కూడా కనిపిస్తుంది. అనిల్ డైలాగ్స్ చాలా బాగా రాశాడు. ఈ సారి కూడా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేద్దాం అనే ఫుల్ ఎనర్జీతో అందరూ పనిచేశారు. సెట్లోకి అడుగుపెడుతూ ఉండగానే ఒక రకమైన హుషారు వచ్చేసేది.. ఆ హుషారుతోనే పనిచేసేవాళ్లం" అని చెప్పుకొచ్చారు.

ఇక వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. " ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోను చకచకా పంచులు పడిపోతూ ఉంటాయి. ప్రతి క్యారెక్టరైజేషన్ పై అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వెంకటేశ్ గారి పాత్రకి రేచీకటి .. నా పాత్రకి నత్తి పెట్టారు. ఆ పాత్రల ద్వారా ఆయన కామెడీని పిండేశారు. ఈ సినిమాలో షూటింగ్ చాలా సందడిగా సాగిపోయింది. సెట్లో ప్రతి రోజూ ఒక పండుగలా అనిపించేది. అంతగా అందరం సరదాగా నవ్వుకుంటూ.. ఎంజాయ్ చేస్తూ చేశాము. " అని అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "కథ బాగుంది .. కొత్తగా ఏం చేయబోతున్నాం అని వెంకటేశ్ అడిగారు. అప్పుడు కొత్తగా అనుకున్న క్యారెక్టరైజేషన్ .. మేనరిజమ్స్ చెప్పాను.. సూపర్.. అదిరిపోయింది అని వెంకటేశ్ గారు అన్నారు.

మనీ అనేది మనందరినీ ఎలా ప్రభావితం చేస్తుంది.. అలా కాకుండా మనమే దానిని ఎలా కంట్రోల్ చేయాలనే ఒక బ్యూటి ఫుల్ మెసేజ్ కూడా ఇందులో ఉంది. వెంకటేశ్ గారి కామెడీ టైమింగ్ వేరు. ఆయనను మిగతా ఆర్టిస్టులు అందుకోవడం కష్టం. ఆయన స్పీడ్ ను మిగతా ఆర్టిస్టులు అందుకునేలా చేయగలుగుతున్నానా అనే ఒక భయం మాత్రం నాలో ఉండేది" అని చెప్పుకొచ్చారు.