Begin typing your search above and press return to search.
ఎఫ్ 3 లో మిస్సయినా ఎఫ్ 4 లో పక్కా...!
By: Tupaki Desk | 27 May 2022 4:35 AM GMTమూడు సంవత్సరాలుగా చర్చ జరుగుతున్న ఎఫ్ 3 సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎఫ్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే ఎఫ్3 ని మొదలు పెట్టబోతున్నట్లుగా ఆ సమయంలోనే దిల్ రాజు మరియు అనీల్ రావిపూడి ప్రకటించారు. ఇప్పుడు ఎఫ్ 3 విడుదల కాకుండానే ఎఫ్ 4 గురించిన చర్చ స్వయంగా యూనిట్ సభ్యులు జరిపారు.
ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు నిర్మాత అంతా కూడా ఎఫ్ 4 తప్పకుండా ఉంటుంది అన్నట్లుగా చెప్పారు. వరుణ్ తేజ్ ఒక అడుగు ముందుకు వేసి ఎఫ్ 4 కోసం రెండు మూడు స్టోరీ లైన్స్ కూడా అనీల్ రెడీ చేశాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎఫ్ 3 విజయం సాధిస్తే ఎఫ్ 4 కు ఆలస్యం లేకుండా క్లాప్ కొడతామని దిల్ రాజు కూడా మరో ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఎఫ్ 3 సినిమా ఫలితం తో సంబంధం లేకుండా ఎఫ్ 4 ఉంటుందని అనీల్ రావిపూడి దాదాపుగా క్లారిటీ ఇచ్చాడు. అదే సమయంలో ఎఫ్ 4 లో మరో హీరో ఉంటాడని కూడా ఆయన హింట్ ఇచ్చాడు. ఎఫ్ 3 లోనే మరో హీరో ఉంటాడని వార్తలు వచ్చాయి. రవితేజ కు ఎఫ్ 3 స్టోరీ లైన్ వినిపించారు.. ఆయన ఓకే అన్నాడు అంటూ ప్రచారం జరిగింది. దిల్ రాజు నో చెప్పడంతో అనీల్ రావిపూడి వెనక్కు తగ్గాడు అనేది పుకార్ల సారాంశం.
ఎఫ్ 3 విషయంలో మూడవ హీరో వార్తలు పుకార్లుగానే మిగిలి పోయినా ఎఫ్ 4 విషయంలో మాత్రం ఖచ్చితంగా మూడవ హీరో విషయం నిజం అవుతుందని అనీల్ రావిపూడి మాటల ద్వారా అనిపిస్తుంది. రవితేజ ఎఫ్ 3 లో మిస్ అయినా ఎఫ్ 4 లో నటిస్తే సూపర్ అంటూ ఇప్పటి నుండే అభిమానులు పొంగి పోతున్నారు. మొత్తానికి ఎఫ్ 4 కు సంబంధించిన హడావుడి ఇప్పటి నుండే మొదలు అవ్వడం కాస్త విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఎఫ్ 3 లో వెంకటేష్.. వరుణ్ తేజ్ తో పాటు సునీల్ మరియు వెన్నెల కిషోర్లు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. సునీల్ పాత్రను కాస్త పెంచి రవితేజ తో మొదట చేయించాలని అనీల్ భావించాడేమో. దిల్ రాజు బడ్జెట్ పేరు చెప్పి అనీల్ ను వారించాడేమో అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఎఫ్ 4 సినిమా విషయంలో ఎన్ని ప్రచారాలు జరిగినా ఎఫ్ 3 కి బ్లాక్ బస్టర్ సక్సెస్ టాక్ వస్తేనే సెట్స్ పైకి వెళ్లేది అనేది కొందరి అభిప్రాయం.
అనీల్ రావిపూడి ఎఫ్ 3 తర్వాత చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఆలస్యం చేయకుండా వెంటనే అఖండ హీరో బాలకృష్ణ తో సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా ముగింపు దశకు వచ్చింది. కనుక అనీల్ రావిపూడి మూవీ రెండు మూడు నెలల్లోనే పట్టాలెక్కి వచ్చే సంక్రాంతికి వస్తుందేమో చూడాలి. ఆ తర్వాత ఎఫ్ 4 గురించి చర్చ జరగాల్సి ఉంది.