Begin typing your search above and press return to search.

అనీల్ ఫాద‌ర్ చిరంజీవిలా హిట్ల‌ర్

By:  Tupaki Desk   |   22 Dec 2019 7:03 AM GMT
అనీల్ ఫాద‌ర్ చిరంజీవిలా హిట్ల‌ర్
X
అన‌తి కాలంలోనే ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి వ‌రుస విజ‌యాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. టాప్ డైరెక్ట‌ర్లు రాజ‌మౌళి.. కొర‌టాల శివ త‌ర‌హాలో అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా సాగిపోతున్నాడు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో స‌రిలేరు నీకెవ్వ‌రు తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని ప్ర‌త్యేక ఈవెంట్ల‌ల‌లో అనీల్ త‌న కుటుంబం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు రివీల్ చేస్తున్నాడు. త‌న గ‌తం..చ‌దువు..సినిమాల్లోకి వ‌చ్చిన వైనం స‌క్సెస్ అవ్వ‌డం గురించి చెప్పుకొచ్చాడు.

మ‌ధ్య త‌గ‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చి టాప్ దర్శ‌కుడిగా ఎద‌గ‌డం నేటి త‌రానికి ఓ స్ఫూర్తి. ఆ విష‌యం ప‌క్క‌న బెడితే అనీల్ రావిపూడి తండ్రి ఆర్టీసీ డ్రైవ‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ బ‌స్సు ఎక్కి స్టీరింగ్ ప‌ట్టుకుంటే హిట్ల‌రేన‌ట‌. మెగాస్టార్ చిరంజీవి చెల్లెళ్ల ర‌క్ష‌ణ‌ విష‌యంలో హిట్ల‌ర్ సినిమాలో ఎలా వ్య‌వ‌హ‌రించారో? అనీల్ తండ్రి న‌డిపే బ‌స్సు ఎక్కితే ఆడ పిల్ల‌ల్ని అంత సేఫ్ గా దింపే వారుట‌. బ‌స్సులో ఎవ‌రైనా ర్యాగింగ్ చేస్తే శివ‌తాండ‌వం ఆడేసేవారు. అలాంటి ఆక‌తాయిల‌ని బ‌స్సు మిర్ర‌ర్ నుంచి ప‌సిగ‌ట్టి నిర్ధాక్ష‌ణ్యంగా బ‌స్సు దించేసేవారుట‌.

ఇక అనీల్ ద‌ర్శ‌కుడైన త‌ర్వాత త‌ల్లి దండ్రుల‌కు సొంత ఊళ్లోనే రెండు ఫ్లోర్ల‌తో ఇల్లు క‌ట్టించాడుట‌. ఆ ఇంట్లోనే నివ‌సిస్తున్నారు. వారానికి ఒక‌సారి ద‌గ్గ‌ర్లో ఉన్న ప‌ట్ట‌ణానికి వెళ్లి సినిమా చూస్తారుట‌. అనీల్ తీసిన సినిమా గురించి ఊళ్లో జ‌నాల‌కు ఎంతో గొప్ప‌గా చెప్పి ఆ తండ్రి మురిసిపోతాడుట‌. అనీల్ సంపాద‌న‌- తండ్రి సంపాద‌న‌ని క‌లిపి సొంత ఊళ్లోనే అనీల్ తండ్రి బిజినెస్ లు చేస్తుంటారుట‌. ఊళ్లో త‌ల్లిదండ్రులు హ్యాపీ.. హైద‌రాబాద్ లో అనీల్ స‌క్సెస్ పుల్ కెరీర్ హ్యాపీగా సాగిపోతుంది.