Begin typing your search above and press return to search.
`ఎఫ్ 3` కోసం వాళ్లంతా రెడీ?
By: Tupaki Desk | 23 May 2022 12:29 PM GMTఇటీవల బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. భారీ చిత్రాలు, లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ కావడం, గత రెండేళ్లుగా ఈ సినిమాల కోసం ప్రేక్షకుల భారీ స్థాయిలో ఎదురుచూడటంతో చాలా వరకు ఫ్యామిలీస్ తో సహ చాలా మంది థియేటర్లకు వచ్చారు సందడి చేశారు. అయితే ఆ తరువాత విడుదలైన సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల సందడి కనిపించడం లేదు. పెద్దగా ఆసక్తిని కూడా చూపించడం లేదు. ఇటీవల విడుదలైన `పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాల కోసం థియేటర్లకు భారీగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి సందడి చేశారు.
అయితే కొంత గ్యాప్ తరువాత మళ్లీ అదే తరహా ఫ్యామిలీ సందడి థియేటర్లలో కనిపించనుందని తెలుస్తోంది. రీసెంట్ గా ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చినా భారీ స్థాయిలో మాత్రం థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ సందడి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన `ఎఫ్ 3` కోసం మహిళా ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, మోనాల్ చౌహాన్ హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీపై బజ్ బాగానే వుంది.
గతంలో వచ్చి `ఎఫ్ 2` కు ప్రధాన బలంగా నిలిచింది ఫ్యామిలీసే. అదే పంథాలో తెరకెక్కిన `ఎఫ్ 3`కు కూడా వాళ్లే బలంగా నిలబడబోతున్నారని చెబుతున్నారు. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 80 కోట్లు. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ మొత్తాన్ని రాబట్టాల్సిందే. యావరేట్ టాక్ ని సొంతం చేసుకున్నా ఈ మొత్తం ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాపై క్రేజ్ ఇప్పటికే మొదలైంది. దాంతో బుకింగ్స్ కూడా బాగున్నాయి.
సినిమాపై భారీ క్రేజ్ వుంది కాబట్టే ఈ మూవీని అత్యధిక మొత్తానికి నిర్మాత దిల్ రాజు అమ్మేశారు. నైజాం మాత్రం ఆయనే రిలీజ్ చేస్తున్నారు. నైజాం ఏరియా వర్త్ 22.5 కోట్లుగా చెబుతున్నారు. తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ అంతా కలిపి 63 కోట్లు దాటిందంట. ఓవర్సీస్, కర్ణాటక అంతా కలిసి మొత్తంగా 80 కోట్ల వరకు అమ్మేశారు. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ భారీ మొత్తం రాబట్టాల్సిందే.
అయితే సినిమాపై ఏర్పడిన క్రేజ్ పరంగా చూస్తే ఇదేమంతా కష్టం కాదని, యావరేజ్ టాక్ వచ్చినా `ఎఫ్3` ఆ మొత్తాన్ని రకాబట్టేస్తుందని, ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా చూస్తున్నారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.