Begin typing your search above and press return to search.

'రామారావు గారు' ఎక్కడ ఆగిందో తెలుసా?

By:  Tupaki Desk   |   4 May 2016 11:30 AM GMT
రామారావు గారు ఎక్కడ ఆగిందో తెలుసా?
X
నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణిని ఫైనల్ చేసి, స్టార్ట్ చేసేశారు. తన సెంచరీ మూవీ ప్రతిష్టాత్మకంగా ఉండాలని భావించిన బాలయ్య.. క్రిష్ కు అవకాశం ఇచ్చేముందు చాలామందితోనే చర్చలు జరిపారు. అందులో కృష్ణవంశీ, బోయపాటి శ్రీనులతో పాటు.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు.

'రామారావు గారు'అనే టైటిల్ పై పటాస్ ఫేం దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ లైన్ బాలయ్యకు బాగా నచ్చిందని అన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు సాయిధరం తేజ్ తో తీసిన సుప్రీమ్ చిత్రం రిలీజ్ సందర్భంగా.. ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనిల్ రావిపూడి.. బాలయ్య సినిమా సంగతులను కూడా పంచుకున్నాడు. టైటిల్ - స్టోరీ లాంటి విషయాలను చెప్పకపోయినా.. తను ఆ ప్రాజెక్ట్ ఎలా మిస్ అయ్యాడో డీటైల్డ్ గా చెప్పాడు అనిల్ రావిపూడి.

'బాలయ్య బాబు తన 100వ చిత్రం కోసం ఏప్రిల్ లోగా స్క్రిప్ట్ ఫైనల్ చేయమని అడిగారు. పూర్తి చేయగలిగితే ఆయనతో వందో సినిమా చేసే ఛాన్స్ దక్కేది. కానీ నేను సుప్రీం చిత్రంతో చాలా బిజీగా ఉండడంతో.. అనుకున్న సమయానికి స్క్రిప్ట్ వినిపించలేకపోయాడట. అలా ఓ అవకాశం మిస్ అయినా.. త్వరలో ఖచ్చితంగా బాలయ్యకు సరిపడే సబ్జెక్ట్ వినిపిస్తాను' ' అంటున్నాడు సుప్రీమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.