Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ నుండి కబురొచ్చిందట

By:  Tupaki Desk   |   27 Oct 2017 4:23 AM GMT
గీతా ఆర్ట్స్ నుండి కబురొచ్చిందట
X
టాలీవుడ్ లో ఒక హిట్టు సినిమా తీస్తే చాలు దర్శకులకు వెంటనే ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో కమర్షియల్ హంగులతో కూడిన కామెడీ ఉంటే ఆ దర్శకుడి పంట పండినట్లే. హీరోకి మార్కెట్ ఉంటె చాలు. యావరేజ్ టాక్ వచ్చినా నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు. అంతే కాకుండా చివరకు దాన్ని హిట్టు సినిమా కూడా అనవచ్చు. ప్రస్తుతం అలాంటి దర్శకులకు టాలీవుడ్ లో చాలా డిమాండ్ ఉంది.

ఆ తరహాలో టాప్ ప్రొడ్యూసర్స్ నుండి కాల్స్ అందుకుంటున్నాడట అనిల్ రావిపూడి. మినిమమ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కథలను తెరకెక్కించే ఈ దర్శకుడిపై ఇప్పుడు పలువురు నిర్మాతలు మనసు పారేసుకున్నారట. రాజా ది గ్రేట్ సినిమా మాస్ సెంటర్లో ఆడేస్తుండటంతో మనోడి రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ లో ఒకటైన గీతా ఆర్ట్స్ సంస్థ నుండి అనిల్ కు ఒక అఫర్ దక్కిందని సమాచారం.

మాస్ ఇమేజ్ ఉన్న రవి తేజని కళ్లు లేనివాడిగా చూపించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన అనిల్ డైరెక్షన్ కి గీత ఆర్ట్స్ వారు ఫిదా అయినట్లు తెలుస్తోంది,. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ సినిమాను తెగ ఇష్టపడినట్లు తెలుస్తోంది. దీంతో గీతా ఆర్ట్స్ అల్లు వారిదే కాబట్టి బన్నీకి ఒక కథను సెట్ చేయమని అల్లు అరవింద్ చెప్పినట్లు తెలుస్తోంది. మరి స్టయిలిష్ స్టార్ కి అనిల్ ఎలాంటి కథ చెబుతాడో చూడాలి.