Begin typing your search above and press return to search.

ఎఫ్‌ 3 : ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   12 April 2020 5:30 PM GMT
ఎఫ్‌ 3 : ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌
X
మొన్న సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న దర్శకుడు అనీల్‌ రావిపూడి ప్రస్తుతం ఎఫ్‌ 3 చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ లో బిజీగా ఉన్నాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెళ్లడి చేశాడు. ప్రస్తుతం తన సొంత జిల్లా అయిన ప్రకాశం జిల్లాలోని తన స్వస్థలంలో తన రైటర్స్‌ టీంతో ఉన్నాను. ప్రస్తుతం ఎఫ్‌ 3 కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవుతుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనీల్‌ రావిపూడి ఎఫ్‌ 3 కి సంబంధించిన మరిన్ని విషయాలను వెళ్లడి చేశాడు. ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు.. పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. ఈ చిత్రంలో వెంకటేష్‌ వరుణ్‌ తేజ్‌ తో పాటు తమన్నా మెహ్రీన్‌ లు కూడా నటించబోతున్నారు. ఈ నలుగురు ఖచ్చితంగా ఎఫ్‌ 3 లో ఉంటారని ఆయన నమ్మకంగా చెప్పాడు. ఇక ఈ చిత్రంలో మూడవ హీరో గురించి ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రెడీ అయిన కథ ప్రకారం అయితే మూడవ హీరో అవసరం రాలేదు. సెకండ్‌ హాఫ్‌ లో ఏమైనా మరో హీరో అవసరం వస్తుందేమో చూడాలి.

ప్రస్తుతానికి మాకు కూడా మూడవ హీరో విషయంలో సస్పెన్స్‌ గానే ఉందని అన్నాడు. ఇక ఎఫ్‌ 2 చిత్రంతో పోల్చితే ఎఫ్‌ 3 చిత్రంలో మరింత ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుందని దర్శకుడు హమీ ఇచ్చాడు. ఎఫ్‌ 2 చిత్రం పెళ్లి నేపథ్యంలో తెరకెక్కింది. కాని ఎఫ్‌ 3 చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో సాగుతుందని అన్నాడు. మొత్తానికి ఎఫ్‌ 3 చిత్రం తన గత చిత్రాలతో పోల్చితే మరింత ఎంటర్‌ టైన్‌మెంట్‌ ను అందించే విధంగా ఉంటుందని నమ్మకంగా చెప్పాడు. ఎఫ్‌ 2 గత ఏడాది సంక్రాంతికి వచ్చిన విషయం తెల్సిందే. మరి ఎఫ్‌ 3 చిత్రం ఎప్పుడు వస్తుందనే విషయంలో క్లారిటీ లేదు.

--