Begin typing your search above and press return to search.

సరిలేరు స్క్రిప్ట్‌ లో మహేష్‌ ఇన్వాల్వ్‌ మెంట్‌ ఎంత?

By:  Tupaki Desk   |   9 Jan 2020 1:30 AM GMT
సరిలేరు స్క్రిప్ట్‌ లో మహేష్‌ ఇన్వాల్వ్‌ మెంట్‌ ఎంత?
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రానికి అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. గత ఏడాది సంక్రాంతికి ఎఫ్‌ 2 తో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న అనీల్‌ రావిపూడి ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటాను అంటున్నాడు. అతి తక్కువ సినిమాలతోనే ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో వర్క్‌ చేసే అవకాశం దక్కించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం తన సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.

ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మహేష్‌ బాబు గారు స్క్రిప్ట్‌ విన్న కేవలం 20 రోజుల్లోనే షూటింగ్‌ ను మొదలు పెట్టాము. ఆయన స్క్రిప్ట్‌ లో సింగిల్‌ చేంజ్‌ కూడా చెప్పలేదు. అసలు ఆయన స్క్రిప్ట్‌ విషయంలో ఇన్వాల్వ్‌ అస్సలు కాలేదు. నాపై పూర్తి నమ్మకంతో ఆయన ఈ సినిమాను చేశాడు. స్క్రిప్ట్‌ మరియు ఆయన పాత్రపై పూర్తి నమ్మకం పెట్టిన మహేష్‌ బాబు ఒక కొత్త హీరో తరహాలో నాకు పూర్తిగా సహకరించాడు. మహేష్‌ బాబు గారి క్రేజ్‌ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

ఒక ఆర్మీమన్‌ సమాజంలో జనాలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఎలా స్పందిస్తాడు అనేది ఈ చిత్రం కథాంశం. ఈ సినిమా కథ ఎక్కువగా హీరో మహేష్‌ బాబు.. విజయశాంతి మరియు ప్రకాష్‌ రాజ్‌ పాత్రల చుట్టు తిరుగుతుంది. ఈ చిత్రంలో హీరో విలన్‌ ను చంపకుండా అతడిలో మార్పును.. సమాజంలో మార్పును తీసుకు వచ్చేలా వ్యవహరిస్తాడు. మొదట ఆ పాత్రకు జగపతి బాబు గారిని అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేక పోయారు. అంతకు మించి వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవని అన్నాడు.

నాకు మొదటి నుండి కూడా కామెడీ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే జంధ్యాల గారి సినిమాలను చూసి ఇన్సిపైర్‌ అయ్యి తన సినిమాల్లో కామెడీ సీన్స్‌ రాసుకున్నాను అన్నాడు. 13 సంవత్సరాల తర్వాత విజయశాంతి గారు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా చూసిన తర్వాత ఆమె ఇన్నాళ్లకు ఈ చిత్రంతోనే ఎందుకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు అనే విషయం అందరికి అర్థం అవుతుంది అన్నాడు. మొత్తానికి అనీల్‌ రావిపూడి ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది.