Begin typing your search above and press return to search.
మహేష్ సూపరే.. మరి డైరెక్టర్?
By: Tupaki Desk | 12 Jan 2020 1:30 AM GMTసరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన వాళ్లందరూ మహేష్ బాబును తెగ పొగిడేస్తున్నారు. సినిమాలో మహేష్ ది వన్ మ్యాన్ షో అంటున్నారు. అతనే తన భుజాల మీద సినిమాను మోశాడంటున్నారు. ఇక అభిమానుల సంగతి చెప్పాల్సిన పని లేదు. చాన్నాళ్ల తర్వాత మహేష్‌ను పూర్తి స్థాయి మాస్ పాత్రలో చూసిన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మహేష్ ను ఇలా కదా మేం చూడాలనుకున్నది అంటున్నారు. కానీ ఇలాంటి క్యారెక్టర్లు మహేష్ ఇంతకుముందు చేయలేదా అంటే అదేమీ లేదు. ఒక్కడు - పోకిరి - దూకుడు లాంటి దీన్ని మించిన మాస్ పాత్రలు చేశాడు. కానీ గత కొన్నేళ్లలో ఉత్తముడి పాత్రలు చేయడం, సటిల్ పెర్ఫామెన్స్ లకు పరిమితం కావడంతో ‘మాస్’ ఫ్యాక్టర్ మిస్సయింది. ప్రేక్షకులకు మళ్లీ ఒక మాస్ సినిమా అతడి నుంచి అవసరమైంది. అలాంటి సమయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చేశాడు. అభిమానులకు ఆనందాన్నిచ్చాడు.
ఐతే ఇక్కడ దర్శకుడు అనిల్ రావిపూడి కొత్తగా చేసిందేంటి అన్నది ప్రశ్న. నిజానికి ఈ సినిమా విషయంలో మహేష్ కంటే అనిల్ పనితీరు ఎలా ఉంటుందో చూడాలని అంతా ఎదురు చూశారు. చాలా తక్కువ వ్యవధిలో - తక్కువ అనుభవంతో అతను సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ దర్శకుడిగా తనదైన ముద్ర వేసి టాప్ లీగ్‌లోకి చేరతాడేమో అని చూశారు ప్రేక్షకులు. ఐతే అతను మహేష్ మూవీని ప్రెజెంట్ చేయడానికి చాలా సులువైన మార్గం ఎంచుకున్నాడు. మహేష్ ఫ్యాన్స్ - ఇతర ప్రేక్షకులు కూడా అతడి నుంచి మాస్ సినిమా కోసం చూస్తుండటంతో నాలుగు ఎలివేషన్ సీన్లు.. రెండు పెద్ద యాక్షన్ బ్లాక్ లు.. మంచి మాస్ పాటలు.. పెట్టుకుని బండి నడిపించేశాడు. ఒక ప్యాకేజీలా సినిమాను తయారు చేసి పెట్టాడు. కథకుడిగా కానీ, దర్శకుడిగా కానీ ఇక్కడ అతడి ముద్ర అంటూ ఏమీ లేకపోయింది. కథ మీద సరైన కసరత్తు చేయలేదు. మహేష్ చేసిన సినిమాల్లో ఇది అత్యంత బలహీనమైన - పేలవమైన కథల్లో ఒకటి అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి మసాలాలు వేసి సినిమాలు నడిపించే దర్శకులు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. అలాంటి దర్శకులు ఔట్ డేటెడ్ అనిపించుకుని సైడైపోయారు. ఇప్పుడు మంచి టైమింగ్ చూసుకుని మహేష్ తో మాస్ సినిమా చేయడం ద్వారా అనిల్ సక్సెస్ సాధిస్తే సాధించొచ్చు కానీ.. దర్శకుడిగా ‘సరిలేరు..’లో అతడి పనితనం మాత్రం పెద్దగా లేదన్నది స్పష్టం.