Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్‌ దొరికాకే.. హీరోని పడతాడట..

By:  Tupaki Desk   |   13 May 2016 12:08 PM GMT
ప్రొడ్యూసర్‌ దొరికాకే.. హీరోని పడతాడట..
X
చాలామంది దర్శకుల పద్దతి ఏంటంటే.. ఒక కథను పక్కాగా రెడీ చేసుకొని.. దానిని ఒక హీరోకు వినిపించి.. అతనితో ఓకె చేయించుకుని.. ఆ తరువాత ఒక నిర్మాతను వెతుక్కుంటారు. ఏ రవితేజో.. ఏ నానియో.. నా కథను ఓకే చేశాడు అంటే.. ఓ 10 కోట్లు పెట్టడానికి చాలామంది నిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అయితే ''పటాస్‌'' అనిల్‌ రావిపూడి మాత్రం వీటికి రివర్సులో ఉన్నాడు.

నిజానికి మనోడు ''సుప్రీమ్‌'' సినిమాతో ఓ మెగా బ్లాక్ బస్టర్‌ కొట్టకపోయినా.. స్టార్‌ హీరోలతో రొటీన్ మసాలాను కాస్త వెరైటీగా తీయడంలో దిట్టే అని నిరూపించుకున్నాడు. పైగా ఈ సినిమాకు కలెక్షన్లు కూడా బాగా వస్తుండటంతో.. తదుపరి సినిమాను మాస్ రాజా రవితేజతో చేస్తున్నాడని టాక్‌ వినిపించసాగింది. అయితే అందులో నిజం లేదంటున్నాడు అనిల్‌ రావిపూడి. తాను ఏ హీరోనూ కలవలేదని అంటున్నాడు.

''ముందుగా ఒక కథని రెడీ చేస్కొని.. దానిని ఒక నిర్మాతకు వినిపిస్తా. ఆయన ఓకె అంటే.. తరువాత హీరోను ఎప్రోచ్‌ అవుతా. సుప్రీమ్‌ కూడా ముందు దిల్‌ రాజుకు వినిపించి.. ఆయన ద్వారా సాయిధరమ్‌ ను కలవడం జరిగింది'' అంటున్నాడు అనిల్‌. అంటే.. ప్రొడ్యూసర్‌ దొరికిన తరువాతే హీరోను టచ్‌ చేస్తాడనమాట. ఎవరి పథకాలు వారివి. ఎలాగొలా పట్టండి గురూ!!