Begin typing your search above and press return to search.
కటౌట్లు ఫ్లెక్సీలు ప్రిపేరవుతున్నాయ్
By: Tupaki Desk | 28 Dec 2019 11:13 AM GMTసంక్రాంతి సినిమాల సందడి మామూలుగా లేదు. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ జోరెక్కిపోతున్నారు. కటౌట్లు .. బ్యానర్లు.. ఫ్లెక్సీలు.. ఒకటేమిటి ప్రచార సామాగ్రిని అన్నివిధాలుగానూ రెడీ చేసేస్తున్నారు. థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఇప్పటికే సిద్ధమైపోతుంటే.. అంతకుముందే జనవరి 5న జరగనున్న సరిలేరు నీకెవ్వరు భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి- మహేష్ కలిసి ఉన్న కటౌట్లను రెడీ చేస్తున్నారట. ఇక ఈవెంట్ కి ఆద్యంతం భారీగా మెగా - ఘట్టమనేని ఫ్యాన్స్ దూసుకొస్తారు కాబట్టి ఆ మేరకు పోలీస్ ప్రొటెక్షన్ చాలా అవసరం అని భావిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ కి ఎలాంటి సవాళ్లు ఎదురు కాకుండా జాగ్రత్త పడేందుకు హైదరాబాద్ పోలీస్ బలగాలు ప్లాన్ చేస్తున్నారట.
అదంతా సరే కానీ.. ప్రస్తుతం ఒక్కొక్కటిగా మహేష్ కోసం రెడీ చేస్తున్న కటౌట్లు సోషల్ మీడియాల్లో రివీలవుతూ అంతకంతకు వేడెక్కించేస్తున్నాయి. ఇక నేటి సాయంత్రం విశాఖ ఉత్సవ్ లో 7 గంటలకు సరిలేరు నుంచి పార్టీ సాంగ్ ని లాంచ్ చేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ ప్రిపరేషన్ చూస్తుంటే దర్శకుడు అనీల్ రావిపూడి పై అంతకంతకు ఒత్తిడి పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. అనీల్ రావిపూడి- అనీల్ సుంకర- దిల్ రాజు బృందం ఈ ఒత్తిడిని ఎదుర్కొని బ్లాక్ బస్టర్ ని ఇవ్వాల్సి ఉంటుంది.
సంక్రాంతి బరిలో సరిలేరు బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందేనన్నంత కసి మహేష్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు తప్పనిసరి. ఇక తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోనూ మహేష్ రికార్డుల గురించి చర్చకు తెరలేచింది. ఇప్పటివరకూ మహేష్ సినిమాల్లో శ్రీమంతుడు- భరత్ అనే నేను ది బెస్ట్ గా నిలిచాయి. అంతకుమించిన రికార్డుల్ని వేటాడుతాడా లేదా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.