Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి..త్రివిక్రమ్ పై సెటైర్లు, ఎక్కువైందేమో!

By:  Tupaki Desk   |   5 Nov 2019 2:30 PM GMT
అనిల్ రావిపూడి..త్రివిక్రమ్ పై సెటైర్లు, ఎక్కువైందేమో!
X
వచ్చే సంక్రాంతికి విడుదల కాబోయే తన సినిమాకు సంబంధించి ఇప్పటి నుంచినే అప్ డేట్స్ ఇస్తూ ఉన్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇప్పటికే 'అల వైకుంఠాపురంలో' సినిమా గురించి ఎన్ని అప్ డేట్స్ వచ్చాయే వేరే చెప్పనక్కర్లేదు. ఒక స్మాల్ టీజర్ విడుదల చేశారు, ఆ తర్వాత ఆ సినిమా హీరో అల్లు అర్జున్ లుక్, ఆ పై రెండు పాటలు.. ఇవన్నీ వచ్చాయి. రావడమే కాదు..అవి జనాలను ఆకట్టుకున్నాయి కూడా! కల్ట్ హిట్ అయ్యాయి. సినిమాపై అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్లాయి.

విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే.. త్రివిక్రమ్ టీజర్లు విడుదల చేసి కొత్త రకం స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడు.అయితే అదే సంక్రాంతికి బరిలో ఉంది మహేశ్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరూ'. ఈ సినిమా గురించి కూడా కొన్ని కొన్ని స్టిల్స్ విడుదల చేశారు. అయితే అవేమంత మరీ కొత్తదనంతో కానీ, జనాల్లోకి దూసుకుపోయేవిలా కానీ లేవు! జస్ట్ యావరేజ్ అంతే.సంక్రాంతికి సహజంగానే రెండు సినిమాల మధ్య పోటీ ఉంది. ఈ పోటీకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికైతే త్రివిక్రమ్ సినిమా ముందుంది, సరిలేరే నీకెవ్వరు వెనుకబడింది.

అలాగని ఇదే ఫైనల్ కాదు. అసలు సినిమాలు వస్తే కానీ, ఎవరిది గెలుపో చెప్పలేం. అయితే ఇంతలోనే 'సరిలేరు నీకెవ్వరూ' దర్శకుడు అనిల్ రావిపూడి రంగంలోకి దిగేశాడు. దీపావళి సందర్భంగా సుబ్బరాజు- వెన్నెల కిషోర్ ల మధ్య సంభాషణ ఒకటి విడుదల చేశాడు. ఆ సంభాషణ పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మీద సెటైర్లా ఉంది. తమ సినిమా గురించి ఇప్పుడు హడావుడి చేయబోం అన్నట్టుగా ఆ వీడియోలోనే అనిల్ రావి పూడి కూడా కనిపించి చెబుతాడు!

తన సినిమా గురించి ఇప్పుడు ఏదో చెప్పమని అనిల్ ను ఎవరూ అడగలేదు. అయినా అతడు ఇలా కెళుక్కున్నాడు అంటే.. ఇది పరోక్షంగా త్రివిక్రమ్ మీద సెటైర్లానే ఉంది! కావాలని చేసినట్టుగా ఉంది ఇదంతా. అనిల్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. సినిమాల మధ్య పోటీని అంతవరకే చూడాలి.

అనిల్ తో సినిమా తర్వాత మహేశ్ బాబు మళ్లీ త్రివిక్రమ్ తో సినిమా చేయగలడు. అలాంటి వాతావరణం వారి మధ్యన ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకుని.. అనిల్ తన పని తను చూసుకుంటే ఆయనకే మంచిదని పరిశీలకులు అంటున్నారు. పోటీగా విడుదల అయ్యే సినిమా ప్రచారంలో ముందుందని..అనిల్ ఇలాంటి వ్యంగ్యం వ్యక్తం చేయడం అంత మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.