Begin typing your search above and press return to search.
హీరొయిన్ తో ఎఫైర్ గురించి దర్శకుడు
By: Tupaki Desk | 3 Jan 2019 7:59 AM GMTసంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాల్లో కామెడీ ఎంటర్ టైనర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తున్న ఎఫ్2 మీద దర్శకుడు అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దీని ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్న అనిల్ విచిత్రంగా తన మీద గతంలో వచ్చిన ఒక ఎఫైర్ గాసిప్ పై స్పందించాడు. ఒక హీరోయిన్ తో అనిల్ కు ఎఫైర్ ఉందని అది ఎప్పటి నుంచో సాగుతోందని అవకాశాల కోసం కూడా రికమెండ్ చేస్తున్నాడని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో స్పందించని అనిల్ ఇప్పుడు మాత్రం పిచ్చ లైట్ అంటూనే వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు.
అవన్నీ పుకార్లేనని తాను ఎలాంటి వాడో కుటుంబానికి మిత్రులకు బంధువులకు తెలుసనీ ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే వాళ్లకు మాత్రమే సమాధానం చెబుతానని అయితే ఆ సందర్భం ఇప్పటివరకు తనకు ఎదురు కాలేదన్న అనిల్ ఇలాంటివి అసలు పట్టించుకోను అంటున్నాడు. గాసిప్స్ అనేవి వస్తూనే ఉంటాయని వాటిని పట్టించుకోనక్కర్లేదని రాసేవాళ్ళు చదివే వాళ్ళు ఇద్దరూ ఉంటారని చెప్పిన అనిల్ మరి అంత అప్రస్తుతమైన వాటి గురించి ఇంత సేపు చెప్పడం ఏమిటో అని మీడియా ప్రతినిధులు చెవులు కొరుక్కున్నారు.
తనను విమర్శించే హక్కు వీటిని పుట్టించిన వాళ్లకు ఉందని అయితే ఇన్నాళ్లు ఎందుకు స్పందించాలి అని సైలెంట్ గా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. అయినా అసలు పట్టించుకోకూడదు అని చెబుతూనే సదరు ఎఫైర్ గాసిప్స్ ని అనిల్ రావిపూడి బాగానే పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. తీవ్రమైన పోటీ మధ్య వస్తున్న ఎఫ్2 మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఒకటి కాదు ఏకంగా మూడు మాస్ సినిమాలతో పోటీ పడాల్సిన నేపధ్యంలో పోటీ కాస్త టఫ్ గానే కనిపిస్తోంది.