Begin typing your search above and press return to search.

హీరోయిన్ ఆరోప‌ణ‌ల‌ పై నిర్మాత గ‌ట్టిగా ఇచ్చేశాడుగా!

By:  Tupaki Desk   |   7 July 2023 9:50 AM GMT
హీరోయిన్ ఆరోప‌ణ‌ల‌ పై నిర్మాత గ‌ట్టిగా ఇచ్చేశాడుగా!
X
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఒక‌టిగా ప్ర‌చారంలో ఉన్న 'గదర్ 2' వచ్చే నెలలో విడుదల కానుంది. అమీషా పటేల్ - సన్నీ డియోల్ ఈ చిత్రంలో సకీనా - తారా సింగ్ పాత్రలతో తిరిగి అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు. గదర్ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ శర్మ ఈ సీక్వెల్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. భారీ అంచనాలున్న సినిమాల్లో ఇది ఒకటి.

కానీ గ‌ద‌ర్ 2 నటి అమీషా పటేల్ అనిల్ శర్మ ప్రొడక్షన్స్ పై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేయడం చాలా మందిని కదిలించింది. ఇప్పుడు దర్శక నిర్మాత‌ అనిల్ శర్మ అమీషా ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు. త‌న కంపెనీ తప్పుడు మేనేజ్ మెంట్ పై ఆమె చేసిన ఆరోపణలకు కౌంట‌రిచ్చారు.

పాపుల‌ర్ హిందీ ఎంటర్ టైన్ మెంట్ న్యూస్ పోర్టల్ తో చాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు అనిల్ శర్మ తన ప్రొడక్షన్ హౌస్ పై అమీషా పటేల్ చేసిన ఆరోపణల పై ఓపెన‌య్యారు. అమీషా ఎందుకు అలా మాట్లాడిందో తనకు తెలియదని అనీల్ శ‌ర్మ అన్నారు. అమీషా చెప్పినవన్నీ అబద్ధాలంటూ ఆమె వాదనలను కొట్టిపారేశాడు.

అదే సమయంలో శ‌ర్మ‌ కూడా తన ప్రొడక్షన్ హౌస్ కి పేరు తెచ్చినందుకు అమీషాకు ధన్యవాదాలు చెప్పాడు. ఇంతకంటే పెద్దది ఏముంటుంది? మా కొత్త ప్రొడక్షన్ హౌస్ కి పేరు తెచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు! అని పోర్ట‌ల్ తో సంభాష‌ణ‌లో వ్యాఖ్యానించారు.

ఇంత‌కీ అమీషా ఆరోప‌ణ‌లు ఏమిటి?

చండీగఢ్ లో గదర్ 2 షూటింగ్ ముగింపు సమయంలో అనిల్ శర్మ అతని ప్రొడక్షన్ హౌస్ టీమ్ కు స‌రిగా సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేద‌ని అమీషా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆరోపించారు. "మే చివరలో చండీగఢ్ లో జరిగిన గదర్ 2 చివరి షెడ్యూల్ లో అనిల్ శర్మ ప్రొడక్షన్స్ కు సంబంధించి కొన్ని సంఘటనలు ఆందోళనక‌రం" అని వ్యాఖ్యానించింది.

మేకప్ ఆర్టిస్టులు కాస్ట్యూమ్ డిజైనర్లు ఇతర సాంకేతిక నిపుణులు ఇబ్బందుల‌కు గుర‌య్యార‌ని అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నుండి బకాయిలు స‌రిగా పొందలేదని అమీషా ఆరోపించారు. దానికి తోడు సిబ్బంది వసతి- రవాణా.. ఆహార బిల్లులను చెల్లించకుండా న‌డిరోడ్డున‌ నిర్మాత‌ వదిలేసార‌ని అమీషా వెల్లడించింది. చివరి రోజు చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్ల‌డానికి వ‌స‌తులు క‌ల్పించ‌లేదు.

అలాగే ఆహార బిల్లులు చెల్లించలేదు. కొంద‌రు తారాగణం సిబ్బందికి ప్ర‌యాణానికి కార్లు కూడా ఏర్పాటు చేయ‌లేదు. వారిని ఒంటరిగా వదిలివేసారు! అయితే మళ్లీ జీస్టూడియోస్ రంగంలోకి దిగి అనిల్ శర్మ ప్రొడక్షన్స్ వల్ల ఏర్పడిన ఈ సమస్యలను సరిదిద్దింది!! అని అమీషా వెల్ల‌డించింది. నిర్మాత అనీల్ శ‌ర్మ వ‌ల్ల‌ చిత్ర బృందం అనేకసార్లు ఎలా గందరగోళానికి గురైందో అమీషా ప‌టేల్ వ‌రుస ట్వీట్ల‌లో వివరించింది.

గదర్ 2 నిర్మాణాన్ని అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నిర్వహించింద‌ని దురదృష్టవశాత్తూ అనేకసార్లు తప్పులు జ‌రిగాయ‌ని పేర్కొంది. ప్ర‌తిసారీ జీ స్టూడియోస్ సమస్యలను సరిదిద్దుకుంది!! జీ స్టూడియోస్ టీమ్ అత్యున్నత స్థాయి టీమ్ అని కితాబిచ్చింది.

ఈ సమస్యను పరిష్కరించినందుకు జీ స్టూడియోస్ కి చెందిన‌ షరీక్ పటేల్ - నీరజ్ జోషి- కబీర్ ఘోష్ - నిశ్చిత్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కూ అమీషా ఆరోప‌ణ‌ల‌పై అనీల్ శ‌ర్మ స్పందించ‌లేదు. మరోవైపు గదర్ 2 టీజర్ ఇటీవల విడుదలైంది. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. శక్తిమాన్ తల్వార్ గదర్ 2 కి ర‌చ‌యిత‌. కొద్ది రోజుల క్రితం మేకర్స్ 'ఉద్ద్ జా కాలే కావ' పాటతో అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచారు. గదర్ 2 ఆగస్ట్ 11న విడుదల కానుంది.

అనారోగ్యానికి గురైన అమీషా:కొద్ది రోజుల క్రితం గదర్ 2 మొదటి షెడ్యూల్‌లో తాను చాలా అనారోగ్యానికి గురయ్యానని అమీషా చెప్పింది. సన్నీ డియోల్ కి విష‌యం తెలిసేప్ప‌టికే తాను దాదాపు ఆసుపత్రిలో చేరబోతున్నానని పేర్కొంది. త‌న హీరో స‌న్నీని ప్ర‌శంసిస్తూ.. నిజ జీవిత తారా సింగ్ అని పెద్దమనిషి అని అమీషా ప్రశంసించింది. గదర్ 2 ఆగస్ట్ 11న విడుదలై OMG 2తో క్లాష్ అవుతుంది.