Begin typing your search above and press return to search.
`కథానాయకుడు` ప్రీసేల్
By: Tupaki Desk | 13 Oct 2018 7:56 PM GMTఎన్టీఆర్ జీవితచరిత్రను రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కథానాయకుడు- జనవరి 9న, మహానాయకుడు - జనవరి 24న రిలీజ్ కానున్నాయి. డెడ్‌లైన్ ప్రకారం.. క్రిష్ ఈ చిత్రాల్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ప్రీరిలీజ్ బిజినెస్ అంతే వేగంగా పూర్తవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే తూ.గో జిల్లా హక్కుల్ని `లెజెండ్` నిర్మాత అనీల్ సుంకర (వింటేజ్ క్రియేషన్స్) చేజిక్కించుకున్నారు. ఈ హక్కుల్ని ఆయన 5 కోట్లకు ఎన్ఆర్ఏ బేసిస్‌లో కొనుక్కున్నారని తెలుస్తోంది.
కర్నాటక, కృష్ణా, వైజాగ్ హక్కుల్ని బాలయ్య స్నేహితుడు సాయి కొర్రపాటి చేజిక్కించుకున్నారని తెలుస్తోంది. అలాగే నైజాం ఏరియాకి ఏషియన్ సునీల్ నారంగ్ పంపిణీ చేస్తున్నారు. సీడెడ్, నెల్లూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి హక్కుల్ని సేల్ చేయాల్సి ఉందిట. ప్రస్తుత దూకుడు చూస్తుంటే బాలయ్య సినిమా పెద్ద రేంజులోనే ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తోందని అర్థమవుతోంది.
ఇక పార్ట్ 2 (మహానాయకుడు) హక్కుల్ని మాత్రం ఇంతవరకూ సేల్ చేయలేదని, కథానాయకుడు రిజల్ట్ చూశాకే సేల్ చేయాలని ఎన్‌బీకే ప్లాన్ చేశారని చెబుతున్నారు. తొలి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే రెండో భాగానికి చక్కని డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టే బయోపిక్‌లో భారీ తారాగణం అభిమానులకు కన్నుల పండువ చేయనున్న సంగతి తెలిసిందే.