Begin typing your search above and press return to search.

‘లై’ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   3 Aug 2017 10:03 AM GMT
‘లై’ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు
X
‘లై’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ఆగస్టు 11కు ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలు పక్కా అని తేలిపోవడంతో.. దీని వల్ల తమకు థియేటర్ల సమస్య తలెత్తుతుందని భావించి ‘14 రీల్స్’ వాళ్లు ఈ సినిమాను వాయిదా వేసేస్తున్నట్లుగా అదే పనిగా మీడియాలోని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఐతే ఇప్పటికే ఒకసారి ఈ ప్రచారాన్ని ఖండించిన నిర్మాత అనిల్ సుంకర.. ఇప్పుడు మరోసారి ‘లై’ పక్కాగా ఆగస్టు 11కే వస్తుందని స్పష్టం చేశాడు. రెండు మూడు రోజులుగా ‘లై’ వాయిదా వార్తలు మరీ శ్రుతి మంచి పోతున్న నేపథ్యంలో అనిల్ సుంకర ట్విట్టర్లో రెస్పాండయ్యాడు.

మార్చి 30న నితిన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. ఆగస్టు 11న ‘లై’ వస్తుందంటూ చేసిన ట్వీట్ ను ఉటంకిస్తూ.. ఈ ట్వీట్ లో చెప్పిన నిజంలో ఎలాంటి ‘లై’ లేదంటూ ట్వీట్ చేయడం ద్వారా తమ సినిమా ముందు చెప్పిన ప్రకారమే ఈ నెల 11న రాబోతోందని స్పష్టం చేశాడు అనిల్ సుంకర. కాబట్టి ఆగస్టు 11కు మూడు సినిమాలూ పక్కా అంటే పక్కా అని ఫిక్సయిపోవాల్సిందే. ఐతే ఈ మూడు సినిమాలో కొంచెం రేంజ్ ఉన్నవే కావడంతో వీటికి థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తారన్నది డౌటు. ఎవరూ వెనక్కి తగ్గని పక్షంలో థియేటర్ల కోసం కొట్టేసుకునే పరిస్థితి ఎదురవుతుందేమో. మరి రిలీజ్ డేట్ దగ్గర పడే సమయానికి ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి.