Begin typing your search above and press return to search.
14 రీల్స్ కు మళ్లీ దెబ్బ
By: Tupaki Desk | 13 Jan 2019 5:30 PM GMTమహేష్ బాబుతో వరుసగా చిత్రాలు నిర్మించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన 14 రీల్స్ సంస్థ ఎంత త్వరగా క్రేజ్ ను దక్కించుకుందో, అంతే త్వరగా కనుమరుగయ్యింది. 14 రీల్స్ సంస్థ మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూనే, మరో వైపు డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఉంది. 14 రీల్స్‌కు చెందిన ఒక నిర్మాత అనిల్ సుంకర నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ గా వరుసగా చిత్రాలను విడుదల చేస్తున్నాడు. తాజాగా ఈయన 'ఎన్టీఆర్' చిత్రాన్ని ఈస్ట్ గోదావరికి కొనుగోలు చేశాడు. బాలయ్య కెరీర్ లోనే ఈస్ట్ గోదావరిలో ఎప్పుడు పడనంత రేటుకు ఎన్టీఆర్ ను కొనుగోలు చేశాడు.
ఎన్టీఆర్ చిత్రంపై నమ్మకంతో తన భాగస్వామ్యులను ఒప్పించి 14 రీల్స్ బ్యానర్ పై ఓవర్సీస్ రైట్స్ ను కొనుగోలు చేశారు. అంతుకు ముందే ఓవర్సీస్ రైట్స్ ను మరొకరు కొనుగోలు చేశారు. అయితే సినిమాపై ఉన్న హైప్ కారణంగా మొదట కొనుగోలు చేసిన వ్యక్తికి అదనంగా చెల్లించి దాదాపుగా మూడు వంతుల రైట్స్ ను దక్కించుకున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో పెట్టుబడి వస్తుందని భావించారు. కాని అనూహ్యంగా ఓవర్సీస్ లో ఎన్టీఆర్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూడం లేదు.
ఓపెనింగ్ అయితే బాగానే రాబట్టినా కూడా ఆ తర్వాత కాస్త తగ్గింది. ఓవర్సీస్ లో 14 రీల్స్ పెట్టుబడి రికవరీ అవ్వడం కష్టమే అంటున్నారు. అయితే మహానాయకుడు సినిమా కూడా ఉన్న కారణంగా అప్పుడేమైనా వర్కౌట్ అయ్యేనా చూడాలి. మరో వైపు ఈస్ట్ రైట్స్ తీసుకున్న అనీల్ సుంకర కూడా గట్టెక్కడం కష్టంగానే ఉంది. ఈయన కూడా మహానాయకుడుపైనే ఆశలు పెట్టుకున్నాడు.