Begin typing your search above and press return to search.
మధుబాబు 'షాడో' ని దృశ్యరూపంలోకి తీసుకురానున్న ప్రముఖ నిర్మాత...!
By: Tupaki Desk | 27 Jun 2020 1:30 AM GMTప్రముఖ నిర్మాత అనిల్ సుంకర 'బిందాస్' సినిమాతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలు తీయడం స్టార్ట్ చేసారు. ఈ బ్యానర్ పై 'అహనా పెళ్ళంట' 'యాక్షన్ 3డి' 'జేమ్స్ బాండ్' 'ఈడో రకం ఆడో రకం' 'రన్' 'అంధగాడు' 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' 'ఈడు గోల్డెహే' 'రాజుగాడు' 'కిరాక్ పార్టీ' 'సీత' 'చాణక్య' వంటి సినిమాలు నిర్మించారు. అయితే ఈ సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. కాకపోతే కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన 'రాజు గారి గది' 'చందమామ కథలు' సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి. ఒక సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు కానీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు నష్టాల బాట పట్టిస్తుంటే ఎవరికైనా కష్టమే.. ఇలా వరసబెట్టి సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలుస్తుండటంతో అనిల్ సుంకర ఇన్ని నష్టాల మధ్య ఇంకా సినిమాలు నిర్మిస్తారా లేక ఆపేస్తారా అని చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో సూపర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ క్రమంలో 'బంగారు బుల్లోడు' మరియు అబ్దుల్ కలామ్ బయోపిక్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పుడు అందరూ నిర్మాతలు వెబ్ వరల్డ్ వైపు అడుగులు వేస్తుండటంతో అనిల్ సుంకర కూడా అదే రూట్ లో వెళ్తున్నాడు. దీని కోసం సుప్రసిద్ధ రచయిత మధుబాబు ని ఆశ్రయించాడు.
తెలుగు నవలలు చదివేవారికి ప్రముఖ రచయిత మధుబాబుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆయన రాసిన 'షాడో' నవలలు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. ఇప్పుడు 'షాడో' నవలలు దృశ్యరూపంలోకి మారబోతున్నాయి. ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర వీటిని వెబ్ సిరీస్ గా తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ''మధుబాబు షాడో'' పేరుతో వీటిని తెరకెక్కించనున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ "మీరు అతని గురించి 20వ శతాబ్దంలో చదివారు. 21వ శతాబ్దంలో కూడా మీరు ఇప్పుడు సేమ్ ఆటిట్యూడ్ తో చూస్తారు". భారతదేశం యొక్క అతిపెద్ద నవల ఫ్రాంచైజీకి విజువల్ ఫార్మాట్ ఇవ్వడానికి మమ్మల్ని విశ్వసించినందుకు ధన్యవాదాలు మధుబాబు గారు. #SHADOWSERIES '' అని ట్వీట్ చేసారు. ఈ సిరీస్ లో ఓ ప్రముఖ హీరో నటిస్తారని సమాచారం. ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థతో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంభందించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.