Begin typing your search above and press return to search.

14 రీల్స్ ఉండగా.. ఇంకో బేనరెందుకు?

By:  Tupaki Desk   |   24 Feb 2016 3:30 PM GMT
14 రీల్స్ ఉండగా.. ఇంకో బేనరెందుకు?
X
14 రీల్స్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పెద్ద బ్యానర్లలో ఒకటి. ‘నమో వెంకటేశ’ లాంటి భారీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. ఆ తర్వాత దూకుడు - లెజెండ్ - 1 నేనొక్కడినే - ఆగడు లాంటి భారీ సినిమాలు నిర్మించింది. 1 - ఆగడు సినిమాలు డిజాస్టర్లవడంతో మధ్యలో కొంచెం జోరు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది 14 రీల్స్. ఈ సంస్థలో అనిల్ సుంకర - రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట భాగస్వాములన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ బేనర్ ఉండగానే అనిల్ సుంకర.. తన కోసం ప్రత్యేకంగా ‘ఏకే ఎంటర్ టైన్ మెంట్స్’ అనే ఇంకో బేనర్ పెట్టాడు. బిందాస్ - అహనా పెళ్లంట - జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు నిర్మించాడు.

మరి 14 రీల్స్ ఉండగా ప్రత్యేకంగా ఈ బేనర్ ఎందుకు అని అనిల్ ను అడిగితే.. ‘‘నాకు వ్యక్తిగతంగా కొన్ని చిన్న తరహా వైవిధ్యమైన సినిమాలు చేయాలని ఉంటుంది. మరోవైపు చాలా కాలంగా నా దగ్గర పని చేస్తూ, నాకు సహకారం అందిస్తున్న వాళ్లకు అవకాశాలు కల్పించాలని కూడా అనిపిస్తుంది. అలాంటపుడు నా బరువును మిగతా ఇద్దరు నిర్మాతల మీద రుద్దడం సరికాదనిపించి సొంతంగా మరో సంస్థను ఏర్పాటు చేశాను. దర్శకత్వం మీద కూడా ఆసక్తి ఉండటంతో ఆ బేనర్లోనే ‘యాక్షన్ 3డీ’ చేశాను. ఐతే రెండు బేనర్లు వేర్వేరు అయినా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో వచ్చే సినిమాలకు కూడా రామ్ - గోపీనాథ్ సహకారం అందిస్తారు. మేం ముగ్గురం కలిసే నిర్ణయాలు తీసుకుంటాం. ఐతే అందులో పెట్టుబడి మాత్రం నా ఒక్కడిదే’’ అని చెప్పాడు అనిల్.