Begin typing your search above and press return to search.
#METOO: ఈసారి తిమింగళం?
By: Tupaki Desk | 17 Oct 2018 6:30 AM GMTమీటూ వలకు పెద్ద చేపలే చిక్కుతున్నాయ్. షార్క్‌లు - తిమింగళాలు బయటపడుతున్నాయ్. పలువురు స్టార్ డైరెక్టర్లు - నటులు చిక్కారు ఇప్పటికే. ఇక నెక్ట్స్ ప్రొడక్షన్ మేనేజర్లు - ఈవెంట్ మేనేజర్లు - మేనేజర్లు క్యూలో ఉన్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీని భ్రష్టు పట్టించే బిగ్ ఫిష్ లుగా వీళ్లంతా పాపులర్. కథానాయికల్ని - నటీమణుల్ని కదిలిస్తే చాలు వీళ్ల లీలలన్నీ బయటకు వచ్చేస్తున్నాయ్. ఇప్పటికి బాలీవుడ్ .. మునుముందు టాలీవుడ్ కి ఉంది ఈ సెగ.
ఇకపోతే తమని వేధించి.. వంచించి... లోబరుచుకుని.. వేటాడే తిమింగళాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయని పలువురు కథానాయికలు నేరుగా మీటూ క్యాంపెయినింగ్‌లో ఫిర్యాదుల తో హోరెత్తిస్తుంటే ఒక్కొక్కరి గుండె ఆగినంత పని అవుతోందిట. ఉపాధి వెతుక్కుంటూ వస్తే వంచనకు గురి చేస్తారా? అంటూ సదరు నాయికలు ఫైరవుతున్నారు.
తాజాగా బాలీవుడ్‌లో ఓ తిమింగళమే దొరికిందన్న మాట వినిపిస్తోంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ పేరుతో ఓ జెంటిల్‌మేన్ ఇప్పటికే పలువురు యంగ్ గాళ్స్ పై వేధింపుల ప్రహసనం సాగించారన్న ఆరోపణల నేపథ్యంలో అతడి పేరు బయటకు వచ్చింది. అతగాడు బాలీవుడ్‌లో బిగ్ డాన్. ఈవెంట్ లలో పేరున్న దొరబాబు. పేరు అనిర్భాన్ బ్లా అతడి పేరు. ప్రఖ్యాత క్వాన్ సంస్థ వ్యవస్థాపక అధిపతి. కొందరు భాగస్వాములతో కలిసి ఈ సంస్థను రన్ చేస్తున్నారట. లేటెస్టుగా అతడి పై నలుగురు నటీమణులు ఫిర్యాదు చేయడంతో పెద్ద రభస మొదలైంది. ఇంతకీ అతడి రేంజెంత? అంటే దీపిక పొదుకొనే - హృతిక్ రోషన్ - సోనమ్ కపూర్ - రణబీర్ కపూర్ - టైగర్ ష్రాఫ్ - కార్తీక్ ఆర్యన్ - శ్రద్ధా కపూర్ - కృతి సనోన్ వంటి టాప్ స్టార్లకు ఈ ఏజెన్సీనే ప్రచారకర్తలు అని తెలుస్తోంది. దశాబ్ధాల పాటు చరిత్ర కలిగిన పెద్ద మేనేజర్ ఆయన. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అతడిని సదరు స్టార్లంతా సపోర్ట్ చేస్తారా? లేక విడిచిపెడతారా? అంటూ ఆసక్తికర డిబేట్ స్టార్టయ్యింది. వికాస్ బాల్ లాంటి స్టార్ డైరెక్టర్ పైనే సోనమ్ కపూర్ - కంగన రనౌత్ వంటి వాళ్లు ఫైరయ్యారు. అలాంటిది ఈవెంట్ మేనేజర్ ని వదిలేస్తారా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇండస్ట్రీలో అన్నిటికీ కారణమయ్యే అసలు తీగ ఇప్పుడే చిక్కింది. ఇకమీదట డొంకంతా కదలబోతోందని అర్థమవుతోంది. ఈవెంట్ మేనేజర్లు - ప్రొడక్షన్ మేనేజర్లు ...తస్మాత్ జాగ్రత్త!!