Begin typing your search above and press return to search.

పవన్ కంపోజర్ పెళ్లిపై క్లారిటీ!!

By:  Tupaki Desk   |   1 April 2017 4:49 AM GMT
పవన్ కంపోజర్ పెళ్లిపై క్లారిటీ!!
X
కొన్ని రోజులుగా మీడియాలో.. సోషల్ సైట్లలో తెగ హంగామా నడిచిపోతోంది. కొలవెరి అంటూ దేశాన్ని ఊపేసిన అనిరుధ్ రవిచందర్.. త్వరలో పెళ్లి చేసేసుకుంటున్నాడంటూ న్యూస్ హల్ చల్ చేసేశాయి. ఏదో అఫైర్.. పెళ్లి లాంటివేవో అయితే అందరూ కామన్ గానే తీసుకునే వారేమో కానీ.. ఇక్కడ పెళ్లికూతురు వివరాలతో సహా ఇవ్వడంతో అందరూ నమ్మేశారు.

చెన్నైకి చెందిన ఓ ప్రముఖ జ్యూవెలరీ స్టోర్ యజమాని కూతురుని అనిరుధ్ పెళ్లి చేసుకుంటున్నాడన్నది ఆ వార్తల సారాంశం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. అసలు ఇలా న్యూస్ లో నానుతున్న ఆ జ్యూవెలరీ స్టోర్ యజమానికి అసలు కూతురే లేదు. ఆ విషయం కూడా చెక్ చేసుకోకుండా.. అనిరుధ్ పెళ్లి అంటూ హంగామా నడిపేశారు. మొత్తానికి ఇప్పటికైతే ఓ క్లారిటీ వచ్చింది. ఈ ఎపిసోడ్ కారణంగా మీడియా ఎంత నిర్లక్ష్యంగా చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ అంటూ విమర్శలు కూడా వచ్చేస్తున్నాయి.

అనిరుధ్ కి ఇప్పుడప్పడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. కెరీర్ లో మరింత ఉన్నత స్థాయికి చేరాకే చేసుకుంటాడని సన్నిహితులు అంటుంటే.. తను నెంబర్ వన్ కంపోజర్ గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట రవిచందర్. ప్రస్తుతం ఈ యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/