Begin typing your search above and press return to search.
తుంబా... పులితో అనిరుథ్ హడావుడి
By: Tupaki Desk | 21 Feb 2019 4:09 PM GMTతమిళ యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుథ్ మెల్ల మెల్లగా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అనిరుథ్ ఆ మూవీ ఫ్లాప్ తో అరవింద సమేతకు సంగీతం ఇచ్చే అవకాశం కోల్పోయాడు. కాస్త గ్యాప్ తర్వాత నాని 'జెర్సీ' మూవీకి సంగీతాన్ని అందించాడు. తాజాగా నాని, విక్రమ్ కుమార్ మూవీకి కూడా అనిరుథ్ సంగీతాన్ని అందించబోతున్నాడు. తమిళంతో పాటు, తెలుగులో కూడా హడావుడి చేస్తున్న అనిరుథ్ తాజాగా 'తుంబా' అనే చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆ సినిమా హీరో ఎవరు, ఇతర వివరాలు ఏంటీ అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు.
'తుంబా' ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో అనిరుథ్ మొబైల్ లో వీడియో గేమ్ ఆడుతుంటే దర్శకుడు హరీష్ రామ్ నుండి ఫోన్ వస్తుంది. చిరాకుగా ఫోన్ రిసీవ్ చేసి, సాఫ్ట్ గా మాట్లాడుతాడు. టైగర్ తో ఒక సినిమాను తీస్తున్నాను. అందుకు తగ్గట్లుగా ఒక ట్యూన్ కావాలని హరీష్ రామ్ కోరడంతో ఫీల్ రావడం కోసం టైగర్ తో షూట్ చేసిన వీడియోను పంపమని అడుగుతాడు. వీడియో ఏంటీ ఏకంగా పులినే పింస్తాడు హరీష్ రామ్. ఆ పులిని చూసి భయపడి పోయి అనిరుథ్ ట్యూన్ చేస్తాడు.
ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఇందులో ప్రత్యేకత ఏంటీ అంటే అనిరుథ్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మరి టైటిల్ మాత్రం 'తుంబా' అని ఏ భాషనో అర్థం కాకుండా ఉంది. తుంబా అంటే ఏంటీ, అసలు ఈ టైగర్ ఏంటీ - హరీష్ రామ్ ఏ హీరోతో సినిమాను తీయబోతున్నాడు అనేది చూడాలి. అనిరుథ్ సంగీతం కనుక ఎవరో స్టార్ హీరోతోనే మూవీ అయ్యి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. తెలుగులో కూడా ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు కనుక ఆ తమిళ హీరో తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో అయ్యి ఉంటాడు. మరి ఆ హీరో ఎవరై ఉంటారో మీరేమైనా గెస్ చేయగలరేమో ఆలోచించండి. పూర్తి వివరాలు త్వరలో వస్తాయేమో చూడాలి.