Begin typing your search above and press return to search.

దయచేసి రెహమాన్ సార్ తో నన్ను పోల్చొద్దు!

By:  Tupaki Desk   |   27 Feb 2019 2:28 PM GMT
దయచేసి రెహమాన్ సార్ తో నన్ను పోల్చొద్దు!
X
భారీచిత్రాల దర్శకుడు శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా 'భారతీయుడు 2' ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 'భారతీయుడు' సినిమాకు కెరీర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన రెహమాన్ ను కాకుండా సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిశంకర్ ను ఎంచుకోవడంపై చాలామంది రెహమాన్ అభిమానులు నిరాశపడ్డారు. అనిరుధ్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై తాజాగా అనిరుధ్ స్పందించాడు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ అవకాశం తనకు రావడం ఎలా అనిపించిందో చెప్పాడు.. "శంకర్ సర్ ఈ ఆఫర్ గురించి 2017 లోనే మాట్లాడారు. కథ కూడా చెప్పారు. '2.0' సినిమా లేట్ కావడంతో 'ఇండియన్ 2' కూడా డిలే అయింది. నేను స్కూల్ లో చదివే సమయం నుండి శంకర్ గారి ఫ్యాన్. దానికి తోడు కమల్ సర్ తో పని చేసే అవకాశం మొదటి సారి కావడంతో ఎగ్జైట్ అయ్యాను. ఈ ఆఫర్ నాకు రావడం కల నిజమవడం లాంటిది."

ఇక రెహమాన్ గురించి మాట్లాడుతూ 'భారతీయుడు ఒక కల్ట్ ఆల్బమ్.. రెహమాన్ సర్ మ్యూజిక్ అందించిన సినిమాలలో అది నాకు మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్. కానీ సీక్వెల్స్ అనగానే ఎప్పుడూ పోలికలు వస్తాయి. కానీ రెహమాన్ సార్ అంటే రెహమాన్ సారే.. ఎవరు కూడా ఆయనను మ్యాచ్ చేయలేరు. 90 లలో 'భారతీయుడు' ఆల్బమ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ను నేను మళ్ళీ క్రియేట్ చెయ్యలేను. నేను నా బెస్ట్ ఎఫర్ట్ పెడతానని.. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్తున్నాను. అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి రెండు సినిమాలను పోల్చొద్దు" అన్నాడు.