Begin typing your search above and press return to search.

దేవి శ్రీ‌ప్ర‌సాద్ కు టార్గెట్ సెట్ చేసిన అనిరుధ్‌!

By:  Tupaki Desk   |   5 Aug 2022 2:30 AM GMT
దేవి శ్రీ‌ప్ర‌సాద్ కు టార్గెట్ సెట్ చేసిన అనిరుధ్‌!
X
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `విక్ర‌మ్‌`. యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెర‌కెక్కించారు. కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీ దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత క‌మ‌ల్ కు ప‌ర్ ఫెక్ట్ క‌మ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ సృష్టించిన ప్ర‌కంప‌న‌లు అన్నీ ఇన్నీ కావు. క‌మ‌ల్ కెరీర్ లోనే రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి క‌మ‌ల్ నే ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ మూవీ ఇచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ఆనందంలో క‌మ‌ల్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు, రోలెక్స్ పాత్ర‌లో చివ‌రి ఐదు నిమిషాలు అద‌ర‌గొట్టిన హీరో సూర్య‌కు, డైరెక్ష‌న్ టీమ్ కు ప్ర‌త్యేకంగా బ‌హుమ‌తులు అంద‌జేసి స‌ర్ ప్రైజ్ చేశారు. `విక్ర‌మ్‌` మూవీ ఈ రేంజ్ లో స‌క్సెస్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అనిరుధ్ అందించిన నేప‌థ్య సంగీతం. ఈ మూవీకి అనిరుధ్ టెర్రిఫిక్ బీజీఎమ్ ని అందించి స‌ర్ ప్రైజ్ చేయ‌డ‌మే కాకుండా త‌న మ్యూజిక్ స్టార్ హీరోల‌ని హంట్ చేసేలా చేశాడు.

`విక్ర‌మ్` రిలీజ్ త‌రువాత ఈ మూవీలో అనిరుధ్ అందించిన త‌ర‌హా బీజిఎమ్ మ‌నకూ కావాల‌ని ప్ర‌తీ హీరో కోరుకుంటున్నార‌ట‌. ఇది ఇప్ప‌డు దేవి శ్రీ‌ప్ర‌సాద్ కు బిగ్ టాస్క్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన మూవీ `పుష్ప‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. బాలీవుడ్ లో ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లేకుండానే రూ. 100 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టడం విశేషం.

ఈ సినిమాకు దేవి అందించిన సంగీతం, పాట‌లు ఓ రేంజ్ లో వైర‌ల్ అయ్యాయి. సినిమా విజ‌యంలోనూ ప్ర‌త్యేక పాత్ర‌ని పోషించాయి. శ్రీ‌వ‌ల్లి, సామీ సామీ, వంటి పాట‌ల‌కు బ‌న్నీ, ర‌ష్మిక వేసిన స్టెప్స్.. బన్ని శ్రీ‌వ‌ల్లి పాట‌కు వేసిన సిగ్నేచ‌ర్ స్టెప్‌, ఊ అంటావా మా పాట‌కు బ‌న్నీ హుక్ స్టెన్‌, దేవి సంగీతం ఓ రేంజ్ లో అద‌ర‌గొట్టాయి.

త్వ‌ర‌లో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో `పుష్ప 2` రాబోతున్న విష‌యం తెలిసిందే. తొలి పార్ట్ తో అద‌ర‌గొట్టిన దేవి పార్ట్ 2 తో మ‌నింత సంద‌డి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఏర్ప‌డిన నేప‌థ్యంలో బ‌న్నీ నేప‌థ్య సంగీతం మ‌రింత దృష్టి పెట్టాల‌ని సూచించిన‌ట్టుగా వాన్త‌లు వినిపిస్తున్నాయి.

సెప్టెంబ‌ర్ నుంచి `పుష్ప 2` సెట్స్ పైకి వెళ్ల‌నున్న నేప‌థ్యంలో ఈ సారి దేవి ఏం చేస్తాడో అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి కూడా పార్ట్ వ‌న్ ని మించి దేవి మ్యాజిక్ చేస్తాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. `విక్ర‌మ్‌`తో అనిరుధ్ ట్రెంట్ సెట్ బీజీఎమ్ ని అందించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన నేప‌థ్యంలో అంత‌కు మించి అన్న‌ట్టుగా బ‌న్నీ ఫ్యాన్స్ దేవి నుంచి ఆశిస్తున్నార‌ట‌. మ‌రి దేవి ఎలా రెచ్చిపోనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.