Begin typing your search above and press return to search.

అనీష మూతి ముద్దుల ముచ్చట్లు

By:  Tupaki Desk   |   27 Dec 2017 12:16 PM IST
అనీష మూతి ముద్దుల ముచ్చట్లు
X
కెరీర్ ని గాడిలో పెట్టుకోవడానికి వైజాగ్ భామ అనీషా ఆంబ్రోస్ బాగానే కష్టపడుతోంది. గత నాలుగేళ్లలో నాలుగు భాషల్లో తెగ ప్రయత్నాలు చేస్తున్న ఈమెకు.. ఇంకా సరైన బ్రేక్ లభించలేదు. ట్యాలెంట్ కు ఏ మాత్రం కొదువ లేకపోయినా.. భారీ సినిమాల ఆఫర్స్ లభించడం లేదు. చిన్న సినిమాల్లో ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ సక్సెస్ లభించకపోవడమే ఇందుకు కారణంగా చెప్పచ్చు.

అయితే.. ఇప్పటివరకూ పక్కింటి అమ్మాయి కేరక్టర్లతో ఆకట్టుకునేందుకు బాగా ప్రయత్నించింది అనీషా. ఒక తరహా స్టాంప్ పడితే, వరుసగా అలాంటి ఆఫర్స్ నే అందించడం మన మేకర్స్ కు కూడా బాగా అలవాటు. ఇప్పుడు ఈ మొనాటనీ నుంచి బయటకు వచ్చేసేందుకు ట్రై చేస్తోంది అనీషా అంబ్రోస్. ప్రస్తుతం ఈమె 'నిన్ను వదిలి నేను పోలేనులే' అనే చిత్రంలో నటిస్తోంది. యంగ్ హీరో హవీష్ కు జంటగా అనీషా నటిస్తున్న ఈ చిత్రం.. రొమాంటిక్ డ్రామా జోనర్ లో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీ హైలైట్ కానుందని తెలుస్తోంది.

అలాగే లిప్ లాక్ సీన్స్ కూడా సినిమాలో చాలానే ఉంటాయట. మొదటిసారి ఇలాంటి సీన్స్ లో నటిస్తున్నా.. ఏ మాత్రం తొణుకు బెణుకు లేకుండా.. ప్రొఫెషనల్ టైపులో ఆయా సీన్స్ ను ఫినిష్ చేస్తోందట అనీషా ఆంబ్రోస్. అమ్మడి కమిట్మెంట్ చూసి మేకర్స్ కూడా తెగ షాక్ అవుతున్నారని టాక్.