Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లుక్ మార్చింది

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:16 AM GMT
ఫోటో స్టోరి: లుక్ మార్చింది
X
సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడానికి అందం.. ఆకర్షణ.. అభినయంతో పాటు కాస్తంత లక్ కూడా కలిసి రావాలి. తెలుగమ్మాయి అయిన అనీషా ఆంబ్రోస్ కు అదొక్కటీ కలిసి రావడం లేదు. హీరోయిన్లను బాపు బొమ్మల్లా చూపించే వంశీ డైరెక్షన్ లో ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో నటించాక కూడా ఏమంత ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న మనోజ్ హీరోగా నటించిన ఒక్కడు మిగిలాడు ప్రేక్షకుల ముందుకు రావడమే బాగా ఆలస్యమైంది. వచ్చాక కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కెరీర్ కు ఇసుమంత కూడా ఉపయోగడపడలేదు.

ఎన్ని ఛాన్సులు వచ్చినా ఏవీ ఉపయోగపడని పరిస్థితుల్లో ఉన్న అనీషాకు లక్కీగా ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలో మొత్తం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తరవాత డైరెక్షన్ చేయబోయే కొత్త సినిమాలో అనీషాను తీసుకున్నాడు. ఈ సినిమా కోసం అనీషా పద్ధతి మార్చింది. తాను ఏ రేంజ్ అందగత్తెనో చూపించడం మొదలెట్టింది. బ్లాక్ టాప్స్.. ట్రెండెడ్ జీన్స్ తో చూడగానే మతులు పోయే హాట్ లుక్స్ తో ఫోజులిస్తోంది. వీటిని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఈ సుందరాంగి ఫోజులు డైరెక్టర్లను బాగానే ఆకట్టుకుంటాయని ఆశించవచ్చు.

తాజాగా రామ్ హీరోగా నటించిన ఉన్నది ఒకటే జిందగీలో కామియో రోల్ లో తళుక్కున మెరిసింది అనీషా ఆంబ్రోస్. దీంతోపాటు నరేష్ తనయుడు హీరోగా వస్తున్న విఠలాచార్య సినిమాలోనూ అనీషా హీరోయిన్ గా నటిస్తోంది.