Begin typing your search above and press return to search.

కాజల్ ని నేనెందుకు వద్దంటాను?

By:  Tupaki Desk   |   22 May 2017 3:58 AM GMT
కాజల్ ని నేనెందుకు వద్దంటాను?
X
లేడీస్ టైలర్ కు సీక్వెల్ రూపొందుతున్న ఫ్యాషన్ డిజైనర్ మూవీ రిలీజ్ కి రెడీ అయిపోతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రలాపాలను ప్రారంభించేశారు. రీసెంట్ గా హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ ప్రెస్ మీట్ కి అటెండ్ అయ్యి.. అనేక విషయాలు చెప్పింది.

'ఈ సినిమాలో నేను ఫారిన్ నుంచి విలేజ్ కి వచ్చిన అమ్మాయి పాత్ర పోషిస్తున్నాను. చీరలు కట్టుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా ఆ రోల్ కు ఎలా కట్టుకోవాలో తెలీదు. పల్లెటూరితో ప్రేమలో పడిపోతుంది. మొదటిసారి గ్లామర్ గా చేస్తున్నాను. నిజానికి వంశీ గారి కారణంగానే గ్లామర్ రోల్ యాక్సెప్ట్ చేస్తాను. అన్ని పాటలు పాపికొండల్లోనే షూటింగ్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చాయి' అని చెప్పింది అనీషా.

'ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. అందరికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. అందరం కలిసి ఒక ఫ్యామిలీగా వర్క్ చేశాం. హీరో సుమంత్ అశ్విన్ నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. కాలేజ్ లో ఫ్రెండ్స్ తో ప్రోగ్రాం చేసినట్లుగా అనిపించింది. వంశీ గారితో పని చేయడం వరం లాంటిది. నా డ్రీ నెరవేరింది. అప్పటి లేడీస్ టైలర్ ఈ తరంలో ఉంటే ఎలా ఉంటుందన్నదే కథ. ఇది రీమేక్ కాదు.. సీక్వెల్ కాబట్టి కచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది' అంటోంది అనీషా ఆంబ్రోస్.

'రాత్రి 10గంటలకు ఫోన్ చేసి.. ఏదైనా ఫలానా ప్రాబ్లెం ఉందంటే నిర్మాత శ్రీధర్ రియాక్ట్ అవుతారు. అంతటి రెస్పాన్సిబిలిటీ ఆయనది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ప్రతీ ఒక్కరికి అభిప్రాయాలు ఉంటాయి. ఫస్ట్ లుక్ ఇలా ఎందుకు ఉందనే విషయం మీకు సినిమా చూస్తే అర్ధమవుతుంది. మీరు టేప్ ని పోస్టర్ లో చూసినా.. ఆయన టేప్ లేకుడానే మెజర్ మెంట్స్ తీసుకుంటారు అని సెలవిచ్చింది.

అయితే మరి సర్దార్ సినిమాలో నిన్ను తీసేసి కాజల్ తో రీప్లేస్ చేశారు కదా.. ఎందుకు? అనడిగితే.. ''కాజల్ విషయానికి వస్తే.. కాజల్ ను నేను ఎందుకు వద్దంటాను. వాళ్లు ఆ పాత్రకు కాజల్ సూట్ అవుతుందని అనుకుని ఉంటారు. ఆ వివాదంలో నాకేమీ సంబంధం లేదు'' అని చెప్పింది అనీషా. ఇది మాత్రం కాస్త ఓవరాక్షన్ అనిపించింది కదూ. సర్లేండి.. కష్టపడుతోంది.. హిట్టు కొడుతుందేమో చూద్దాం.