Begin typing your search above and press return to search.

ఫ్యాషన్ డిజైనర్ తో 'రన్' మొదలవ్వాలి

By:  Tupaki Desk   |   27 Nov 2016 3:54 AM GMT
ఫ్యాషన్ డిజైనర్ తో రన్ మొదలవ్వాలి
X
షూటింగ్ మధ్యలో ఉన్న టాలీవుడ్ ప్రాజెక్టుల్లో.. ఫ్యాషన్ డిజైనర్ పై బోలెడంత క్రేజ్ ఉంది. సీనియర్ డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న మూవీ కావడం.. అప్పటి లేడీస్ టైలర్ కు సీక్వెల్ ను.. ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా ఫ్యాషన్ డిజైనర్ గా తీస్తుండడంతో ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై కావాల్సినంత బజ్ ఉంది.

కాసింత అడల్ట్ కామెడీకి దగ్గరగా అనిపించినా.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా జనాలు లేడీస్ టైలర్ ను మెచ్చారు. ఇప్పుడా లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్ కాగా.. ఇతడు కూడా ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తాడు. ఈ ముగ్గురిలో ఒకరిగా హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ నటిస్తోంది. మూడేళ్ల నుంచి టాలీవుడ్ లో తెగ ప్రయత్నాలు చేస్తోంది కానీ.. ఈమెకు సక్సెస్ మాత్రం దరి చేరలేదు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన సందీప్ కిషన్ రన్ మూవీలో చేసిన యాక్టింగ్ కు పేరొచ్చినా.. ప్రయోజనం దక్కలేదు. తరువాత 'మనమంతా' సినిమాలో హీరోయిన్ గా మెరిసిన.. పేరు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చింది.

ఇప్పుడు వంశీ హీరోయిన్ గా అలరించనుండడం.. అనీషాకు బాగా కలిసొచ్చే విషయం. వంశీ డైరెక్షన్ లో ఒక్క హిట్ సినిమాలో నటించినా తను టాప్ హీరోయిన్ అయిపోతాననే హోప్ ను బాగా వంట బట్టించేసుకుంది అనీషా ఆంబ్రోస్. మరి అమ్మడి కోరికలు నెరవేరతాయో లేదో తెలియాలంటే కొన్ని నెలల టైం పడుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/