Begin typing your search above and press return to search.

పవన్ హీరోయిన్ కి ఇంకో ఛాన్స్

By:  Tupaki Desk   |   13 March 2017 4:52 AM GMT
పవన్ హీరోయిన్ కి ఇంకో ఛాన్స్
X
అనీషా ఆంబ్రోస్ పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా సరే.. పవన్ హీరోయిన్ అనే స్టాంప్ మాత్రం పడిపోయింది. ఇందుకు కారణం.. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో హీరోయిన్ అంటూ ఏడాదిపాటు జరిగిన ప్రచారమే.

చివరకు ఆ ఛాన్స్ కాజల్ కు వెళ్లిపోయినా సరే.. అనీషాకు మాత్రం గబ్బర్ సింగ్2 స్టాంప్ అలాగే కంటిన్యూ అయిపోయింది. అలియాస్ జానకి అంటూ టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. పవన్ హీరోయిన్ అనే స్టాంప్ తో సందీప్ కిషన్ మూవీ రన్ లో అవకాశం అయితే వచ్చింది కానీ.. ఆ సినిమా నిరుత్సాహపరిచింది. ఇప్పుడీ బ్యూటీకి మరో అవకాశం లభించింది.

మంచు మనోజ్ హీరోగా రూపొందుతోనున్న ఒక్కడు మిగిలాడు చిత్రంలో హీరోయిన్ గా అనీషా ఆంబ్రోస్ కు ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా కూడా మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. మనోజ్ మూవీతో అయినా తనకు బ్రేక్ లభిస్తుందని.. అనీషా బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/