Begin typing your search above and press return to search.
బుల్లి రోల్ లో లీడ్ హీరోయిన్
By: Tupaki Desk | 5 Sep 2017 12:51 PM GMTఒకసారి మెయిన్ హీరోయిన్ పాత్రలో కనిపించాక.. మళ్లీ చిన్నా చితకా పాత్రల్లో కనిపించడం అంటే చాలా రిస్క్. హీరోయిన్స్ విషయంలో ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యం. అందుకే కెరీర్ తొలినాళ్లలో ఒప్పుకునే చిన్నా చితకా పాత్రలను తర్వాత స్థాయిలో ఒప్పుకోరు.
కానీ అనీషా ఆంబ్రోస్ పరిస్థితి ఇలాగే మారిపోయింది. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేసింది అనీషా ఆంబ్రోస్. నాలుగేళ్లుగా తెలుగులో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ భామ.. ఎట్టకేలకు లీడ్ హీరోయిన్ రోల్ దక్కించుకున్న అదృష్టం దక్కలేదు. ఈ సినిమాతో పాటు ఈ అమ్మడు కూడా డిజాష్టరే అనిపించుకుంది. ఇప్పుడు ఓ చిన్నపాటి రోల్ కు అంగీకరించడం హాట్ టాపిక్ అవుతోంది. ఉన్నది ఒకటే జిందగీ అంటూ.. రామ్ హీరోగా నటిస్తున్న మూవీలో లావణ్య త్రిపాఠి.. అనుపమా పరమేశ్వరన్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కొద్ది సేపు మాత్రమే కనిపించే మరో హీరోయిన్ రోల్ ఉంటుందట. ఈ రోల్ కోసం అనీషా ఆంబ్రోస్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది.
సినిమాకు కీలకం అని చెప్పుకుంటున్నా.. అంత నమ్మే విధంగా ఏం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లావణ్య..అనుపమాలు తమ పాత్రల షూటింగ్ పూర్తి చేసేయగా.. త్వరలో మిలాన్ వెళుతున్న రామ్ అండ్ టీం.. అక్కడే అనీషా ఆంబ్రోస్ కు సంబంధించిన పార్ట్ ను పిక్చరైజ్ చేయనున్నారు.