Begin typing your search above and press return to search.

సర్దార్ మిస్ అయినా.. ముందే వస్తున్న భామ

By:  Tupaki Desk   |   22 March 2016 5:49 AM GMT
సర్దార్ మిస్ అయినా.. ముందే వస్తున్న భామ
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయిపోతోంది. ఇప్పుడంటే ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంది కానీ.. ఈ మూవీ ప్రారంభానికి చాలానా టైం గడించింది. దర్శకులు - హీరోయిన్.. ఇలా చాలా మందిని మార్చాక.. చివరకు ఈ మూవీ ఈ దశకు వచ్చింది.

గబ్బర్ సింగ్2 లో మొదట హీరోయిన్ గా అనుకున్న భామ పేరు అనీషా ఆంబ్రోస్. ఆడిషన్ నిర్వహించారు., అనీషానే ఫైనల్ అని ఫిక్స్ చేశారు. అలా చెప్పిన తర్వాత 8 నెలలు గడిచిపోయాయి. ఇంకా వాళ్ల సెర్చింగ్ జరుగుతూనే ఉంది. స్టోరీతో పాటు దర్శకుడు కూడా మారిపోయిన పరిస్థితి. ఈ 8నెలలు పవన్ పక్కన తను ఎలా పెర్ఫామ్ చేయాలో రిహార్సల్స్ చేసుకుంటూ ఉండేదట. ఆ తర్వాత ఈ మూవీలో కాజల్ ను ఫైనల్ చేశారని తెలిసింది. సహ నిర్మాత శరత్ మరార్ తాపీగా ఈ విషయాన్ని చేరవేశాడు. అఫ్ కోర్స్.. నా కంటే కాజల్ బెటర్ ఆప్షన్ అని నేనూ ఒప్పుకుంటా అంటూ అనీషా తన మంచితనాన్ని చూపించింది.

అలా ఆ ఏడాదంతా తుడిచిపెట్టుకు పోయాక.. తర్వాతేం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో.. సందీప్ కిషన్ నేరం రీమేక్ చేస్తున్నాడని తెలిసి అప్రోచ్ అయ్యాను. అతను ఫ్రెండ్ కూడా కావడంతో.. ఈ ప్రాజెక్టులో ప్రవేశించింది అనీషా ఆంబ్రోస్. మొత్తానికి పవన్ సినిమాలో ఛాన్స్ మిస్ అయినా.. రన్ అంటూ.. పవన్ కంటే రెండు వారాల ముందే థియేటర్లలోకి వచ్చేస్తోంద అనీషా ఆంబ్రోస్.